రాఘవేంద్ర మదర్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నీ అకస్మిక తనికి ,డి ఎం హెచ్ వో.
జోగులాంబ గద్వాల 11 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. తేదీ.11.6.2024 న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్. ఎస్. శశికళ మరియు ఉప - జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్. ఎస్.కె .సిద్ధప్ప రాఘవేంద్ర మదర్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ని గద్వాల ను ఆకస్మికంగా తనిఖీ చేసి 09.6.2024 న మృతి చెందిన గర్భిణీ స్త్రీ శ్రీమతి శివలీల కు సంబంధించిన ఐపి రిజిస్టర్ మరియు ఓటి రిజిస్టర్ , ల్యాబ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, సి - సెక్షన్ రిజిస్టర్ డెలివరీ రిజిస్టర్ తనిఖీ చేసి , రికార్డులను, రిపోర్టులను, తీసుకోవడం జరిగింది , తదనంతరము ఈ కేసుకు సంబంధించిన రిపోర్టును జిల్లా కలెక్టర్ కి సమర్పించడం జరుగుతుందని తెలియజేయడం అయినది... తదనంతరము సూరజ్ క్లినిక్ చింతల పేట గద్వాల కూడా ఆకస్మికంగా చేయడం జరిగింది.. తనిఖీ సమయంలో ఈ క్లినిక్ నందు క్వాలిఫైడ్ డాక్టర్ కాకుండా ఇతర వ్యక్తులు రోగులకు చికిత్సలు అందిస్తున్నందువల్ల ఈ క్లినిక్ కి నోటీసు ఇవ్వడం జరిగింది..... ఈ తనిఖీ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు కే .మధుసూదన్ రెడ్డి ఇంచార్జ్ - డిప్యూటీ. డెమో మరియు జి. నరసయ్య క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఇన్చార్జ్ పాల్గొనడం జరిగింది..