అయిజ పట్టణంలో యువకుడి పై కత్తితో హత్యాయత్నానికి దాడి..

జోగులాంబ గద్వాల 5 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి. అయిజ:-పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి పై అదే పట్టణాకి చెందిన మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కొత్త బస్టాండ్ దగ్గర నర్సప్ప గుడి పక్కన చేనేత కార్మికుడు నేష మాస్ (19) నివాసం ఉంటున్నాడు.వారి ఇంట్లోకి దూరి గూడు బాషా అనే వ్యక్తి ప్రవేశించి యువకున్ని అతి దారుణంగా కత్తితో పొడిచిచాడు. దీంతో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అది గమనించిన స్థానికులు యువకున్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.