మీ బిడ్డల వలే చూసుకోండి... వంట రుచికరంగా వండండి...ఎమ్మెల్యే

Feb 5, 2025 - 20:54
Feb 5, 2025 - 20:55
 0  1
మీ బిడ్డల వలే చూసుకోండి... వంట రుచికరంగా వండండి...ఎమ్మెల్యే
మీ బిడ్డల వలే చూసుకోండి... వంట రుచికరంగా వండండి...ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల 5 ఫిబ్రవరి 2020 5 తెలంగాణ వార్తా ప్రతినిధి.  మానవపాడు.:-మన బిడ్డలని భావించి నాణ్యతమైన వంట చేసి విద్యారులకు భోజనం పెట్టాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మానోవపాడు కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆవరణలో రూ.3 కోట్ల 25 లక్షల తో కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత గా లేకపోవడం, పప్పు సాంబార్ రుచికరంగా ఉండకపోవడంతో ఆయన నేరుగా పరిశీలించారు. మన ఇంట్లో పిల్లలకు ఏ విధంగా వంట చేస్తున్నామో.ఆ విధంగా వంట చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని  ఎమ్మెల్యే విజేయుడు కోరారు. అనంతరం పాఠశాలలో వసతులను కూడా నేరుగా పరిశీలించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువుతోపాటు రుచికరమైన భోజనం అందించినప్పుడే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కళాశాల కోసం నిర్మిస్తున్న భవనానికి కూడా నాణ్యతగా నిర్మించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గదుల నిర్మాణం ఉండాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు, కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నాయి.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State