వైద్య విద్యార్థిని మృతికి నిరసనగా జే.డీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
కొవ్వొత్తులతో సంఘీభావ ర్యాలీ.
భద్రాచలం 18 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- కలకత్తాలో వైద్య విద్యార్థిని మృతికి నిరసనగా భద్రాచలం పట్టణంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు, ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛంద సంస్థ సభ్యులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చారు గుల్ల శ్రీనివాస్ పాల్గొని వైద్య విద్యార్థిని మృతి క సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య సభ్యులు చాంబర్ ఆఫ్ కామర్స్ అధినేత కంభంపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అనే మాటకు అర్థం తెలిపే ప్రాణాలు కాపాడే దేవుళ్ళ ను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉండటం చాలా బాధాకరం అని, కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు మరల జరగకుండా చట్టాలను రూపొందించాలని కోరారు .ఈ కార్యక్రమంలో జీడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ హన్సీ సభ్యులు కడాలి నాగరాజు,యూసఫ్ మీయా, వేమూరి పవన్ రామోజు రాముడు ,భీమవరపు వెంకటరెడ్డి, ఎస్ కే టి గ్రూప్ రాము, కొండిశెట్టి సత్యనారాయణ, పి ,వాసు, చారు గుల్ల పండు, త్రిబుల్ ఎక్స్ చక్రవర్తి, కే శ్రీనివాస్, ఉడతా రమేష్, చెంచు సుబ్బారావు, చారు గుల్ల దుర్గాప్రసాద్ , భద్రాద్రి మహిళా సమితి సీతా మహాలక్ష్మి, పద్మ, ముంతాజ్, జ్యోతి, మల్లిక , జానకి, ప్రభమని, మీడియా మిత్రులు పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.