అధికార పార్టీకి చెందిన యువ నాయకుడి ఆగడాలు పార్టీ పెద్దలు అరికట్టాలి

Jul 27, 2024 - 19:21
Jul 27, 2024 - 19:29
 0  624
అధికార పార్టీకి చెందిన యువ నాయకుడి ఆగడాలు పార్టీ పెద్దలు అరికట్టాలి

*అధికార పార్టీకి చెందిన యువ నాయకుడి ఆగడాలు పార్టీ పెద్దలు అరికట్టాలీ*

*జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి*

*గిరిజనుల పట్టా భూమును ఆక్రమించాలని దళితులను ప్రేరేపిస్తున్నాడు*

 జులై 27 వెంకటాపురం తెలంగాణ వార్త:- అధికార పార్టీని అడ్డుపెట్టుకొని గిరిజనుల పట్టా భూముల్లోకి దళితులను ఉసిగొలుపుతున్న యువ నాయకుడి ఆగడాలను పార్టీ పెద్దలు అరికట్టాలని జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ఒక ప్రకటన ద్వారా సూచించారు. శనివారం మరికాల z లో ఉన్న ఆదివాసీల భూములను సందర్శించారు. పద్నాలుగు మంది ఆదివాసీలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున 14 ఎకరాల ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ చేసి ఇచ్చారు అన్నారు. అధికార పార్టీకి చెందిన ఒక యువ నాయకుడు గిరిజనేతరులు అయిన దళితులను ఆదివాసీల పట్టా భూముల్లోకి వెళ్లకుండా చేస్తున్నాడని సాయి ఆరోపించారు. మరికాల z లో ఉన్న అట్టం సమ్మక్క ఇంటి స్థలాన్ని యువ నాయకుడి సామాజిక వర్గానికి చెందిన తన బంధువు అయిన వ్యక్తి కబ్జా చేసాడు అని అన్నాడు. దీని వెనుక అధికార పార్టీకి చెందిన హస్తం నాయకుడి హస్తం ఉన్నదని హస్తం నాయకులు తెలుసు కోవాలని హితువు పలికారు.తమ స్వలాభం కోసం ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీల్లోకి వెళ్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నాయకులు అన్నారు. ఆ అయోమయం లోనే ఇలాంటి చట్ట వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్నట్లు ఏద్దేవా చేశారు. తన స్వగ్రామానికి చెందిన దళితులను గిరిజనుల పట్టా భూముల్లోకి వెళ్లే విధంగా ప్రేరేపిస్తున్నట్లు ఆయన పైన మండిపడ్డారు.అమాయక దళితులను అడ్డు పెట్టుకొని గిరిజన చట్టాల పైన దాడులకు పాల్పడుతున్నట్లు విమర్శించారు. అధికార హస్తం పార్టీ నాయకులకు ఇతగాడి అరాచకాలు కానరావడం లేదా అని ప్రశ్నించారు. బాధిత గిరిజనులు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన పట్టించు కోవడం లేదన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడే అధికారులను ప్రలోభాలకు గురి చేస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.అన్యాయం గిరిజనులు వెళ్లి కేసులు పెట్టిన పట్టించు కోకపోవడం ఏమిటన్నారు. గిరిజన ప్రాంతాల్లో పని చేసే అధికారులు గిరిజనుల సమస్యలను విస్మరించడం పట్ల సాయి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. న్యాయం కోసం వెళ్తే పంచాయతీ లు చేయడం లో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. దళితులను అడ్డుపెట్టుకొని భూములు కబ్జా చేపించి వారి నుంచి స్వాధీనం చేసుకుంటున్నట్లు కొంతమంది బాధిత దళితులు తమ గోడు వెళ్ళబుచ్చు కుంటున్నారని అన్నారు. తన స్వగ్రామం లోని దళితులు, ఆదివాసీలు తన చెప్పు చేతల్లో ఉండాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే అధికార పార్టీ నాయకులు యువ నాయకుడి ఆగడాలను అరికట్టక పోతే పార్టీలో ఉన్న ఆదివాసీలు అంత పార్టీ వదిలి వెళ్లిపోవాలని సాయి పిలుపునిచ్చారు. గిరిజన చట్టాలను గౌరవించని హస్తం పార్టీలో ఆదివాసీలు పని చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆదివాసీల భూముల పైకి వస్తే గిరిజనేతరులు పైన కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు. దీని కోసం అన్ని ఆదివాసీ సంఘాలు ఏకం అయి ప్రత్యేక్ష పోరాటాలకు సిద్ధం అవుతున్నట్లు సాయి మీడియా కు తెలిపారు.ఇప్పటికైనా తన పద్దతి మార్చుకోక పోతే ప్రజల నుండి వ్యతిరేఖతను ఎదురు కోవాల్సిన వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో రైతులు పాల్గొన్నారు.