అక్రమ ఇసుక రవాణా కు అడ్డుకట్ట

తిరుమలగిరి 14 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని అనంతరం గ్రామ సమీపంలోని బిక్కీరు వాగు నుండి అక్రమ ఇసుక రవాణా నిలుపుదల చేయుటకు గాను కందకము తీయించినారు. ఇకపై ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేయుటకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడునని మండల తహశీల్దార్ బి. హరి ప్రసాద్, ఇంచార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ . ఐలయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ఐ నికోలస్ , డిప్యూటీ తాసిల్దార్, సర్వేయర్, ఆరైలు మరియు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.