కోరుట్ల కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ
![కోరుట్ల కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ](https://telanganavaartha.com/uploads/images/202502/image_870x_67af2882cbfb9.jpg)
కోరుట్ల,ఫిబ్రవరి 14 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-: రంగారెడ్డి జిల్లా కోర్టు 9వ మెట్రోపాలిటన్ జిల్లా జడ్జిపై నేరస్థుడు దాడికి పాల్పడిన సంఘటనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త న్యాయవాదుల విధుల బహిష్కరణ చేయాలనే పిలుపు మేరకు శుక్రవారం కోరుట్ల కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులను బహిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి సుతారి శ్రీనివాస్, కోశాధికారి చిలువేరి రాజశేఖర్, సురేష్, రఘు, సత్యం, శ్రీనివాస్,గంగాధర్, అమరెందర్ రావు, నరేందర్, గణేష్, ప్రేమ్, వివేక్, నవీన్, రమేష్, విజయ్ సాయి, అల్లె రాము, ఉమా,దీప న్యాయవాదులు పాల్గొన్నారు.