ముందుల సామేలుకు మంత్రి పదవి ఇవ్వాలి.

నాగారం జూలై 6 . తెలంగాణ వార్త:- రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుకు మంత్రి పదవి ఇవ్వాలని నాగారం మండల యువజన నాయకులు పాల్వాయి పరశురాములు శనివారం పత్రిక ప్రకటనలో కోరారు. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొంది చరిత్ర సృష్టించిన మందుల సామేలుకు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు.