సూర్యాపేట రక్షణ ఎక్కడ? ఇబ్బందులకు గురువుతున్న రోగులు పట్టించుకోని కాంట్రాక్టర్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఎటువంటి రక్షణ కవచం లేకుండా కొత్తగా బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు.... తగు రక్షణ చర్యలు లేకుండా నిర్మాణాలు చెప్పటంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ నిర్మాణంలో ఉండడంతో పైనుండి ఇటుక పెడ్డలు, మల్ పైనుండి కిందకు పోయడంతో కింద ఉన్నవారి మీద అనేకసార్లు పడ్డ ఘటనలు ఉన్నాయని ఆస్పత్రికి వచ్చే ప్రజలు వాపోతున్నారు...ఈ ఘటన పై అనేకసార్లు రోగులు సంబంధిత వారి దృష్టికి తీసుకుపోయిన.. గుత్తేదారుల నిర్లక్ష్యంతో ఈ విధంగా జరుగుతుందని ఆరోపిస్తున్నారు... ఏమైనా జరగరానిది జరిగితే కారుకులు ఎవరని మండిపడుతున్నారు...గర్భిణీలకు తప్పని ఇబ్బందులు మత శిశు ఆరోగ్య కేంద్రానికి అనేకమంది గర్భిణీలు వివిధ ప్రాంతాల నుండి ఆస్పత్రికి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారనీ కానీ రక్షణ లేకుండ ఉండటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.కనీసం రక్షణ చర్యలు తీసుకోరా గుత్తేదారుల నిర్లక్ష్యంతో నిర్లక్ష్యంతో... ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి... నెలకొన్న సమస్యను పరిష్కరించాలని ఆస్పత్రికి వచ్చే గర్భిణీలు రోగులు వారి వెంట వచ్చే బంధువులు కోరుతున్నారు..