సరోగసి కోసం పిలిచి లైంగిక వేధింపులు అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి చనిపోయిన మహిళ
హైదరాబాద్ - మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి మృతిచెందిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ (25) అనే మహిళ.
సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగను తెచ్చుకున్న రాజేష్ బాబు అనే వ్యక్తి పిల్లలను కనివ్వడం కోసం పది లక్షల డీల్‌ను మాట్లాడుకున్న రాజేష్ బాబు..
గత కొన్నాళ్లుగా అశ్వితను లైంగికంగా వేధిస్తున్న రాజేష్ బాబు.. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో పారిపోవడానికి ప్రయత్నించిన అశ్విత సింగ్..
తప్పించుకునే క్రమంలో అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి చనిపోయిన అశ్విత సింగ్..
అశ్విత సింగ్‌కు భర్త మరియు నాలుగు సంవత్సరాలలో బాబు ఉన్నాడు..
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు..
రాజేష్ బాబు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..