గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్‌ పోటీలు

రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలవాలి

Dec 27, 2024 - 18:50
Dec 27, 2024 - 18:51
 0  3

పిసిసి సభ్యులు,పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్‌ క్రీడాపోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోందని పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి గారు అన్నారు.

పిల్లలమర్రిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మైదానంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా నుండి ఎంపికైన కబడ్డీ క్రీడాకారులకు కొప్పుల వేణారెడ్డి గారు మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఫోటో లోగోతో కూడిన టీ షర్ట్స్ అందించారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి గారు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం సీఎం కప్‌ క్రీడా పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. 

స్వతహాగా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడైన సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలను, క్రీడాకారుల ను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూని వర్సిటీని సైతం ఏర్పాటు చేయబోతున్నారన్నారు. గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందన్నారు. 

క్రీడలకు, క్రీడాకారులకు నిలయమైన సూర్యాపేట జిల్లా ఎంతో మంది క్రీడల ద్వారా ఉద్యోగ అవశాశాలు పొందారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సత్తాచాటాలన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333