తాహసిల్దార్ హామీతో దీక్షలు విరమణ
తాహసిల్దార్ హామీతో దీక్షలు విరమణ
వెంకటాపురం జూన్ 21 తెలంగాణ వార్త ప్రతినిధి
గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కొమరం భీమ్ కాలనీ ఆదివాసులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 12వ రోజు చేరుకున్నాయి.క్రమంలో, వెంకటాపురం మండల తాహసిల్దార్ వరప్రసాద్ వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమార్ కలిసి కొమరం భీమ్ కాలని ఆదివాసీల దీక్షలను న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్షలు విరమించడం జరిగింది.ఈ సందర్భంగా జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ భూభాగంలో ప్రతి ఒక్క ప్రభుత్వ భూములపై ఆదివాసులకే హక్కు ఉందని ఆయన అన్నారు.ఐక్యరాజ్య సమితిలో 140 దేశాలు భూమిపై నీటిపై అడవిపై సర్వ హక్కులు ఆదివాసులకే ఉన్నాయని ఐక్యరాజ్యసమితి శ్రీ కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు చెబుతున్నాయని,ఆ కమిటీ సిఫార్సు అధికారులు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన అన్నారు.శ్రీకృష్ణ కమిటీ ఏజెన్సీ ప్రాంతంలోకి 2008లో ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీల జీవన విధానం కోసం పరిశీలించి ఆదివాసీల చట్టాలను అమలు చేయాలని శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ ఏ అధికారి కూడా పట్టించుకోవడంలేదని అవేదన వ్యక్తపరిచారు.కొమరం భీం ఆదివాసులకు న్యాయం జరగకపోతే త్వరలో ఏటూరునాగరం ఐటీడీఎ ఎదుట దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిఎస్పి ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్, కొమరం భీమ్ కాలనీ ఆదివాసులు పాల్గొన్నారు.