మానవత్వం చాటుకున్న సీనియర్ జర్నలిస్ట్ కందుకూరి లక్ష్మయ్య

తిరుమలగిరి 08 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : తిరుమలగిరి మున్సిపల్ కేంద్రానికి చెందిన ఒక వృద్ధురాలు స్కూటర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా అటుగా వెళుతున్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ సాక్షి ఎడిటర్ కందుకూరు లక్ష్మయ్య వెంటనే స్పందించి ఆ వృద్ధురాలిని అంబులెన్స్ లో సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డుకు చెందిన ముదంగుల మైసమ్మ స్కూటర్ ప్రమాదంలో గాయపడగా వెంటనే స్పందించిన తుంగతుర్తి నియోజకవర్గ ప్రెస్ ఇన్చార్జి కందుకూరు లక్ష్మయ్య చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో పలువురు లక్ష్మయ్య ను అభినందించారు