అయిజలో పోలీసు కవాతు..
జోగులాంబ గద్వాల 6 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఐజ. రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జోగులాంబ గద్వాల జిల్లా.. అయిజ పట్టణ కేంద్రంలో ఎస్సై ఆధ్వర్యంలో ఐటిబిపి కేంద్ర బలగాలు రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినియోగించుకునే పరిస్థితిని కల్పించడంలో భాగంగా ఈ కవాతు నిర్వహించడమైనదని అన్నారు.ఈ కార్యక్రమంలో అయిజ ఎస్సై విజయ్ భాస్కర్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.