మద్ది కాయల ఓంకార్ కాగడా ప్రదర్శన ప్రారంభ యాత్రను జయప్రదం చేయండి

May 11, 2025 - 20:27
 0  46
మద్ది కాయల ఓంకార్ కాగడా ప్రదర్శన ప్రారంభ యాత్రను జయప్రదం చేయండి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కాగడా ప్రదర్శన ప్రారంభ యాత్రను జయప్రదం చేయండి. ఆత్మకూర్ ఎస్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి సభ సందర్భంగా నేడు ఏపూర్ లో ఉదయం 10 గంటలకు బస్ స్టాండ్ ఆవరణం లో కాగడ ప్రారంభ యాత్ర సభను జయప్రదం చేయాలని అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ జిల్లా మచ్చా పూర్ వద్ద ఆసియా ఖండంలో అతి పెద్ద స్మారక స్తూపం వద్ద మే 12 వ తేదీన సాయంత్రం 4 గం లకు అమరజీవి కామ్రేడ్ ఓంకార్ గారి శతజయంతి ప్రారంభ సభ ను జయప్రదం చేయుటకు కామ్రేడ్ ఓంకార్ పుట్టిన గ్రామం ఏపూరు నుండి ప్రారంభమగు కాగడ సభను జయప్రదం చేయాలని కోరారు. ఏపూర్ గ్రామం లో జరిగే కాగడ యాత్ర ప్రారంభ సభను సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రారంభిస్తారని ఈ కార్యక్రమానికి ఎంసీపిఐయు పార్టీ జాతీయ కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ ,రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మస్కుల మట్టయ్య హాజరవుతున్నారని కావున ప్రజలు , ప్రజా తంత్ర వాదులు, మేదావులు, కవులు, కళాకారులు, ఓంకార్ అభిమానులు అనుచరులు సహచరులు విద్యార్థి,యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న,సీపీఎం మండల కార్యదర్శి ఆవిరే అప్పయ్య, మాజీ సర్పంచ్ సానబోయిన రజిత సుధాకర్, కాంగ్రెసు గ్రామ శాఖఅధ్యక్షులు బుడిగ, లింగయ్య, సీపీఎం గ్రామ కార్యదర్శి సానబోయిన ఉపేందర్ ,నూకల గిరి ప్రసాద్ రెడ్డి ,ఎరుకల నాగరాజు, హుస్సేన్ పాల్గొన్నారు.