చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం
కరీంనగర్, 8 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ చేనేత కార్మికుల సమస్యలను వివరించేందుకు తమకు కేంద్ర జౌళి శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, రాపోలు వీర మోహన్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను సాయంత్రం కలవడం జరిగింది. అలాగే వివిధ సమస్య లపై వినతి పత్రం అందజేయడం జరిగింది. దాదాపు 20 నిమిషాల పాటు తమకు సమయం కేటాయించి చేనేత కార్మికులు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
దీనిపైన మంత్రి సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్యల పైన చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని త్వరలోనే చేనేత ఐక్య వేదిక బృందంలో కొంతమందికి అపాయింట్మెంట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ చేనేత ఐక్యవేదిక ద్వారా రాష్ట్రంలో చేనేత కార్మికుల పలు సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్, మహిళా విభాగం కోశాధికారి భీమనాతి శారద మరియు శాంతి కేంద్ర మంత్రి బండి సంజయ్ ని శాలువాతో సన్మానించారు. వారు శారద తో మాట్లాడుతూ ఒక్క చేనేత సమస్య లే కాదమ్మా. మీరు ఉపాధ్యాయులు కదా పిల్లలకు మన కట్టు బొట్టు సంస్కృతీ సంప్రదాయలను,పెద్దలతో వారు ప్రవర్తించే విధానం మరియు సంస్కారం గురించి పాఠాలతో పాటు చెబుతూ ఉండాలి. మీరే కదా రేపటి తరంను సంస్కారవంతంగా తయారు చేసేది.మీరే కదా దేశ భవిష్యత్ తరాలను తీర్చి దిద్దే గురువులు అంటూ ఎంతో గౌరవంగా ఆత్మీయంగా మాట్లాడడం జరిగింది.