మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలి

Mar 27, 2025 - 01:19
Mar 27, 2025 - 01:21
 0  3
మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలి
మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలి

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి.

తెలంగాణవార్త మాడుగుల పల్లి మార్చి 26:- ఈరోజు మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలనిరాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ధాన్యానికి 2800 మద్దతు ధర కల్పించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారుబుధవారం నాడు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మాడ్గులపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం వినతిపత్రం అందజేశారుఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ప్రజా పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారుదానిలో భాగంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలు పర్యటించి సమస్యలు గుర్తించడం జరిగిందన్నారుగ్రామాలలోని ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారునూతన రేషన్ కార్డులు లేక నూతనంగా వివాహం చేసుకున్న వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని అని రేషన్ కార్డు ఉన్నవారికి వారి పిల్లల పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించా అనిశాశ్వత రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు57 సం.లు పూర్తి అయిన వయో వృద్దులకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని అన్నారుఇండ్ల స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు.మాడ్గులపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రానికి లింక్ రోడ్లు,బీటీ రోడ్లు మంజూరు చేసి వెంటనే నిర్మించాలన్నారు.మండలం ఏర్పడి పది సంవత్సరాలు కావొస్తున్న నేటికి ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం,పోలీస్ స్టేషన్,ఉపాధి హామీ కార్యాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,సంఘబంధం కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు వరద కాలువకు తక్షణమే లైనింగ్ ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని కోరారు.మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది దానిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అధే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలన్నారు.పంట నష్టపోయిన రైతులను గుర్తించి వారికి ఎకరానికి 30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.వరి ధాన్యానికి 2800 లకు తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.అన్ని గ్రామాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.ముగ్గురు ఎమ్మెల్యే లు ఉన్నా కూడా‌ నేటికి మండలం అభివృద్ధి చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు.కావున ముగ్గురు ఎమ్మెల్యేలు మాడ్గులపల్లి మండలం పైన దృష్టి సారించి పై సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు దేవి రెడ్డి అశోక్ రెడ్డి, వేములపల్లి మాజీ వైస్ ఎంపీపీ పాదూరు గోవర్దన,సీపీఎం మండల కమిటీ సభ్యులు పుల్లెంల శ్రీకర్,పతాని శ్రీను,బొమ్మకంటి అంజయ్య, ఊరుగొండ శ్రీను, అయితగాని విష్ణు,బొంగరాల వెంకటయ్య, తంగెళ్ళ నాగమణి,కేసాని లక్ష్మయ్య ,దేవి రెడ్డి మల్లారెడ్డి నాయకులు రవి,ఎలిజాల రమేష్,బొంగర్ల యల్లయ్య,పండుగ నాగయ్య,భూపతి రెడ్డి,చింతచర్ల శ్రీను,వెంకన్న,రాజు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333