ప్రభుత్వానికి చెడ్డ పేరు తేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు.
జోగులాంబ గద్వాల 18 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- అలంపూర్. నియోజకవర్గం గద్వాల్ నుండి కర్నూల్ కి వెళుతున్న గద్వాల డిపో బస్సు లో అనేకులు ప్రయాణికులు గద్వాల్ నుండి కర్నూలు పట్టణానికి వెళుతూ ఉంటారు అయితే మధ్య మధ్యలో వారి యొక్క గ్రామాలకు వెళ్ళడానికి కొన్ని స్టాపులు ఏర్పాటు చేయడం జరిగింది.ఆ స్టాపుల దగ్గర కూడా బస్సు డ్రైవర్లు ఆపడం లేదు శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఒక గవర్నమెంట్ డ్యూటీ చేయడానికి ఒక ఆమె ఉండవెల్లి స్టాప్ దగ్గర ఆపమని అడిగింది అయితే కండక్టర్ కూడా దానికి సహకరించడం జరిగింది.
కానీ డ్రైవర్ మాత్రం నిర్లక్ష్యంతో ఆపను అని ఆపకుండగా వెళ్లిపోవడం జరిగింది.ప్రయాణికులు మాట్లాడుతూ..ఫ్రీ బస్సు గవర్నమెంట్ పెట్టడం బాగుంది,కానీ ఏమైనా డ్రైవర్లు ఫ్రీగా డ్యూటీ చేస్తున్నారా వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు కదా మరి ప్రయాణికులకు ఎందుకు సహకరించడం లేదు.ఈ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మా యొక్క గ్రామాలకు మా యొక్క డ్యూటీలకు వెళ్లడానికి దూరం నుండి వస్తూ ఉంటాం మేము ఎక్కడపడితే అక్కడ ఆపడం లేదు కదా కనీసం స్టాప్ ఎక్కడ అయితే పెట్టినారో అక్కడే అపమనము ఆపకుండగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ఎంత ఇబ్బందులు పడుతూ అలంపూర్ చౌరస్తాలో దిగి మళ్ళీ అక్కడ నుండి వెనక్కి రావడం జరుగుతుంది.డ్రైవర్ల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తేస్తున్నారు.దీని విషయంలో బస్ డిపో మేనేజర్ డ్రైవర్ల పై చర్యలు తీసుకోవాలని మాట్లాడడం జరిగింది.