టైలర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి

Feb 28, 2025 - 19:40
Feb 28, 2025 - 19:41
 0  5
టైలర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి

సూర్యాపేట జిల్లా టైలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దూలం నగేష్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే సెలబ్రేషన్స్

టైలర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి టైలర్స్ అందరికీ ఉపాధి కల్పించాలని పెన్షన్లు అందజేయాలని జిల్లా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దూలం నగేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టైలర్స్ డే సందర్భంగా శుక్రవారం సూర్యాపేట వల్లభాపురం స్టేజ్ దగ్గర గండూరి గార్డెన్స్ లో జరిగిన టైలర్స్ డే సమావేశానికి కొత్త బస్టాండ్ దగ్గర నుండి ర్యాలీగా ఏర్పడి  టైలర్స్ అందరూ 300 మంది సమావేశంలో పాల్గొన్నారు. ఈ  సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దూలం నగేష్  మాట్లాడుతూ ప్రభుత్వం నుండి కంటి చూపు తగ్గిన వారికి  పెన్షన్లు, నిరుపేద టైలర్లకు  ఇండ్లు కావాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద టైలర్స్ అందరికీ ఉపాధి కల్పించాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్   పేద టైలర్స్ కి ఆర్థిక సహాయం చేశారు. టైలర్స్ సభ్యులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో  బండపల్లి పాండురం గాచారి, గట్ల సిద్ధప్ప, తెంబరేణి  వీరేశ్,,ప్రధాన కార్యదర్శి కర్నేఉపేందర్, వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పున్నం రమేష్ మేరెడ్డి, సత్యనారాయణ,  మహిళా టైలర్స్ అధ్యక్షురాలు భువనగిరి చంద్రకళ, మేడిగ శ్రీనివాస్, చెకిలం రవి, ప్రసాద్, కత్తుల రవి,తెంబరేణి కృష్ణ , అంతటి రమేష్ గౌడ్, బిల్ల కేశవులు, నూతి అంజయ్య, కీర్తి వెంకటేశ్వర్లు జెల్ల ఉపేందర్  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333