మల్లురవి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామ లీడర్లు ఇంటింటి ప్రచారం

May 10, 2024 - 21:21
May 10, 2024 - 21:22
 0  72
మల్లురవి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామ లీడర్లు ఇంటింటి ప్రచారం

09-05-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:-  చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి కి మద్దతుగా ఈరోజు సాయంత్రం చిన్నంబావి మండలం గూడెం  గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జూపల్లి అభిమానులు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి గుర్తు హస్తం గుర్తు పైన ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినట్టి పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు  ఆదేశానుసారం ఈరోజు సాయంత్రం గూడెం గ్రామంలో ఈవీఎం చూపిస్తు, ఇంటికి డోర్స్ స్టిక్కర్లు అతికిస్తూ మల్లు రవి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఓటు వేయాలని ప్రతి ఇంటి దగ్గర వివరిస్తూ చెప్పడం జరిగింది.

 ఇట్టి కార్యక్రమంలో జూపల్లి అనుచరులు, గ్రామ లీడర్లు, పార్టీ అభిమానులు, పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State