గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యులు నిరవధిక సమ్మె
గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాద్యాయుల నిరవధిక సమ్మె
ఆదివాసీ టీచర్స్ ఫెడరషన్ తెలంగాణ సంపూర్ణ మద్దతు
వాజేడు డిసెంబర్ 24 తెలంగాణ వార్త:-
ఐ టి డి ఎ ఏటూరునాగారం కార్యాలయం ముందు కాంట్రాక్టు ఉపాధ్యాయలు నిరవధిక సమ్మెకి ఎ టి ఎఫ్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ సప్క నాగరాజు మాట్లాడుతూ.....గత 20 సంవత్సరాలకు పైగా ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్దులకు నాణ్యమైన విద్యను అందిస్తూ,గిరిజన విద్యార్దుల సర్వతోముఖ అభివృద్ధికి నిరంతరం గా తోడ్పడుతూ శ్రమ దోపిడీకి గురి అవుతున్న కాంట్రాక్టు ఉపాద్యాయుల ను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలి . సి ఆర్ టి ల యొక్క న్యాయ పరమైన డిమాండ్స్ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం జరిగింది.
డిమాండ్స్:---
*ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్టు ఉపాద్యాయుల ను రెగ్యులర్ చేయాలి,
*సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి. మినిమం టైం స్కేల్ ఇవ్వాలి,
*ప్రతి నెల ఒకటో తారీఖు న గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి,
*మహిళ కాంట్రాక్టు ఉపాద్యాయులకు వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి,
*కాంట్రాక్టు ఉపాద్యాయులకు హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలి,
* పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలి,
ఈ కార్యక్రమంలో సి ఆర్ టి ల రాష్ట్ర అధ్యక్షుడు సోమేశ్వర్, రాష్ర్ట ఉపాధ్యక్షులు రవీందర్,జిల్లా అధ్యక్షులు కొండ రామయ్య,, వివిధ పాఠశాలల కాంట్రాక్టు ఉపాద్యాయులు పాల్గన్నారు.