మండల చంద్రయ్య వ్యాఖ్యలు అర్థరహితం..... సురభి వెంకటనారాయణ

మునగాల 10 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి సురభి వెంకటనారయణ అన్నారు. మండలంలో కలకోవ గ్రామంలో ఏర్పాటు చేసిన శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి సురభి వెంకటనారయణ మాట్లాడారు. గ్రామంలో ఇటీవల జరిగిన శాఖ మహాసభలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ 31 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి నేటికీ 18 వేల కోట్ల రూపాయలు మాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అలాగే మరో 14 వేల కోట్లు రైతు రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడారు ఇట్టి అంశంపై అవగాహన లేని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పుకుంటున్న మండవ చంద్రయ్య అర్థరహిత వాక్యాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే గ్రామంలో ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తి గత 30 సంవత్సరాలుగా రైతుల నుండి మార్కెట్ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తుంటే ఆయనపై అవార్కులు చవాక్కులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. మరొకసారి ఇలాంటి చౌక భారు మాటలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మండవ వెంకటాద్రి, గ్రామ శాఖ సిపిఎం పార్టీ సభ్యులు బి వెంకటేశ్వర్లు, కొంపల్లి లింగయ్య, ముదిగొండ శీను తదితరులు పాల్గొన్నారు.