మాంటిస్సోరి ట్రెడిషన్స్ హై స్కూల్ గద్వాల లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సంబరాలు

జోగులాంబ గద్వాల 17 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. పట్టణంలోని బురద పేట డ్యామ్ రోడ్ లో గల మాంటిస్సోరి ట్రెడిషన్స్ హై స్కూల్ లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ మరియు మెడల్ ను, ఐఐటీ 1,2 ర్యాంక్ సాధించిన విద్యార్థులకు మరియు 1 నుండి 9 వ తరగతి విద్యార్థులకు 1,2,3 ర్యాంక్ సాధించిన విద్యార్థులకు షీల్డ్ లను పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పి రవి ప్రకాష్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ సుమ బిందు పి నిరంజన్ రెడ్డి ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పి రవి ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపల్ సుమ బిందు, నిరంజన్ రెడ్డి, విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.