తుంగతుర్తి: గానుగబండ చెరువులో ఆకట్టుకుంటున్న తామర పుష్పాలు

తుంగతుర్తి ఏప్రిల్ 18 తెలంగాణ వార్త ప్రతినిధి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ చెరువులో తామర పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. చెరువు కట్ట నుంచి వెళ్తున్న స్థానిక ప్రజలకు ప్రయాణికులకు తామర పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. తామర పుష్పాలు అందంగా ఉండడంతో వాటి పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. స్థానికులు తామర పుష్పాలు,తామర గింజలను సేకరిస్తున్నారు. తామర గింజలు ఎంతో ప్రియమైనవి ఆరోగ్యకరమైనవి.