ప్రైవేట్ పాఠశాలలు చూపించే హంగు ఆర్భాటాలను చూసి మోసపోకండి

Jun 12, 2025 - 19:02
 0  5
ప్రైవేట్ పాఠశాలలు చూపించే హంగు ఆర్భాటాలను చూసి మోసపోకండి
ప్రైవేట్ పాఠశాలలు చూపించే హంగు ఆర్భాటాలను చూసి మోసపోకండి
ప్రైవేట్ పాఠశాలలు చూపించే హంగు ఆర్భాటాలను చూసి మోసపోకండి
ప్రైవేట్ పాఠశాలలు చూపించే హంగు ఆర్భాటాలను చూసి మోసపోకండి
ప్రైవేట్ పాఠశాలలు చూపించే హంగు ఆర్భాటాలను చూసి మోసపోకండి

ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలు మిన్న
 
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఒత్తిడి ఉండదు 

కాంగ్రెస్ సీనియర్ నాయకులు న్యాయవాది కావలి గోవింద్ నాయుడు

వనపర్తి జూన్ 12 పోలీస్ నిఘా  : ఈ రోజున వైశాఖపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో పాఠశాల నుంచి ఊరి వరకు ర్యాలీ తీయడం జరిగింది. గ్రామ ప్రజలకు సమావేశం నిర్వహించి కావలి గోవిందు వివరించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గోవింద నాయుడు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలను మిన్న అనే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఒత్తిడి లేకుండా అనుభవజ్ఞులైన టీచర్లు బోధించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల డ్రెస్ కోడ్ను చూసి అంగు ఆర్భాటాలను చూసి మోసపోవద్దని తల్లిదండ్రులకు ఈ సందర్భంగా సూచించారు. మన పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడాలని చాలామంది తల్లిదండ్రులు ఇంటిదగ్గర ఉంచుకుంటే చెడిపోతారని ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. గవర్నమెంట్ స్కూల్ లలో గవర్నమెంట్ కాలేజీలలో చదివిన వారు ఐఏఎస్ లు ఐపీఎస్ లు అయ్యారు. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న మన పిల్లలు వాళ్లు పెట్టే ఒత్తిడి వల్ల పెద్ద పెద్ద జాబులు పొందలేకపోతున్నారు. శాఖాపూర్ గ్రామంలో విద్యార్థిని విద్యార్థినిలు పదిమంది డాక్టర్ చదివిన ఐఏఎస్ ఐపీఎస్ లు చదివిన చదివిస్తానన్నారు. గ్రామంలోనే ఉండి గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటానని అన్నారు. పేదలు అనారోగ్యం పాలైన వైద్య ఖర్చులు భరిస్తానన్నారు. ఎంతోమందికి సాయం చేసే శక్తి దేవుడు తనకి ఇచ్చాడని చెప్పుకొచ్చారు. అనంతరం పదవ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నగదును ప్రోత్సాహంగా అందించారు. అధ్యాపకులు, గ్రామ పెద్దమనుషులు సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోవింద్ నాయుడుతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్టా తిరుపతయ్య, జక్కుల శీను, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ యాదవ్, ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్గుమన్ బలరాం, చిన్న స్కూల్ అధ్యాపకులు, పెద్ద స్కూల్ అధ్యాపకులు, కాంగ్రెస్ నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333