మాజీ సర్పంచ్ చింత సమ్మయ్య మృతి
![మాజీ సర్పంచ్ చింత సమ్మయ్య మృతి](https://telanganavaartha.com/uploads/images/202412/image_870x_676c00dbc2d6c.jpg)
మాజీ సర్పంచ్ చింత సమ్మయ్య మృతి ఆయన మృతి వాజేడు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
వాజేడు డిసెంబర్ 25 తెలంగాణ వార్త:- మండల పరిధిలోని చింతూరు గ్రామపంచాయతీలో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింత సమ్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చింతూరు గ్రామపంచాయతీలో అనేక పర్యాయలుగా సర్పంచ్ ఎన్నికై చింతూరు గ్రామ పంచాయితీలో పార్టీలకు అతీతంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీకి వాజేడు మండలంలో తీరని లోటు అని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆయన కుటుంబాని వాజేడు కాంగ్రెస్ పార్టీ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించి ప్రాగడ సానుభూతిని వ్యక్తం చేశారు.