ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు వినతి

జోగులాంబ గద్వాల 11జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఉండవెల్లి. మండల కేంద్రంలో ధర్నా చేపట్టిన ఆశా కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని చాలీచాలని జీతాలతో వెట్టి చాకిరి చేస్తున్నామని ఎమ్మెల్యే విజయుడు కు ఆశా కార్యకర్తలు విన్నవించారు.ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.