భారత్ కేనా  ఈ గండం?  లేదు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా! భారత్ను వణికిస్తున్న ప్రత్యేక సందర్భమెంటి?

Apr 7, 2025 - 19:03
Apr 7, 2025 - 19:19
 0  1

చైతన్యం,  ప్రభుత్వ చర్యలు, ప్రత్యామ్నాయ వినియోగంతో  భవిష్యత్తు తరాలకు  ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ బాంబు నుండి  విముక్తి పొందడమే 

----  వడ్డేపల్లి మల్లేశం


గత వారం కేరళ హైకోర్టు  ప్లాస్టిక్  వాటర్ బాటిల్ల విచ్చలవిడి  వినియోగం పైన  ఆందోళన వ్యక్తం చేయడం  ఒక అంశం కాగా ,  గతంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా  ఒక దశలో " మనం ప్రస్తుతం ప్లాస్టిక్ బాంబు పైన కూర్చున్నాం  ఆ మహమ్మారిని కట్టడి చేయడంలో విఫలమైతే అన్వాస్త్రాలను మించిన  ముప్పు భావితరాలు ఎదుర్కొనక తప్పదు.  ఆ దుర్భర పరిస్థితి నుండి  త  ప్పుకోవాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించడం ప్రత్యామ్నాయ వినియోగాన్ని  ప్రభుత్వాలు ప్రోత్సహించడం తప్పనిసరి" అని  హెచ్చరించిన తీరు  భారతదేశంలోని ప్రతి గుండెను  తట్టి లేపుతుంది. ప్రజల, పాలకుల, శాస్త్రవేత్తల,పరిశోధకుల బాధ్యతలను  మరింత గుర్తింప చేసినట్లు కూడా.  ఎన్నో అవాంఛనీయ పరిణామాల మాదిరిగా మానవ జీవితంలోకి మెల్లగా పిల్లిలా ప్రవేశించిన  ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి చేస్తున్న తీవ్ర హాని  ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి లాగిన  తీరు విచారకరం.  తిను బండారాలు  ఇతర సరుకులు   ఏది కొన్న ప్లాస్టిక్ కవర్లలోనే ఇంటికి తెచ్చుకోవడం పరిపాటిగా మారిన   వేల   ప్లాస్టిక్ వినియోగం విపరీత పరిణామాలను ఒక్కసారి మననం చేసుకుంటే   జాగ్రత్త పడవచ్చు కదా!  టీ కాఫీలకు  ప్లాస్టిక్    సంచులు వాడడం, వాటర్ బాటిల్ల వినియోగం, ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం, హోటలలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం  వంటి అనేక సందర్భాలలో  వీటి వినియోగం వలన  డిఎన్ఏ ను, కణాలను  దెబ్బతీసి ప్రాణాంతక గుండె జబ్బులు, క్యాన్సర్లు,  సంతానలేమి,  ఇతర భయంకర రోగాలకు దారి  తీ స్తున్నది . కర్ణాటక రాష్ట్రంలోని పలు హోటల్ల లో  ప్లాస్టిక్ షీట్ల వాడకంతో ఇడ్లీలోకి  క్యాన్సర్ కారకాలు  చేరుతున్నట్లు పరిశీలనలో తేలగానే  ఆందోళన చెందిన కర్ణాటక ప్రభుత్వం  హోటల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినట్లు తెలుస్తున్నది.


ప్లాస్టిక్ వినియోగంతో  మరికొన్ని  విష పరిణామాలు

దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే ఇంగ్లాండ్లోని లీడ్స్ వర్సిటీ పరిశోధకుల  2024  పరిశోధన ప్రకారంగా భారత్ లోనే ప్రపంచంలో అత్యధికంగా  ప్రతి ఏటా 93 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త  రీసైక్లింగ్కు నోచుకోవడం లేదని అందులో 58 లక్షల టన్నులను కాల్చి వే స్తుంటే మిగిలింది పర్యావరణం లోకి  చేరి విష పరిణామాలకు దారితీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.  అధిక వినియోగం కారణంగా  గాలి నీరు  నేల నదులు సముద్రాలు అన్నీ కూడా విషతుల్యం అవుతున్నాయి భూమిలో సులభంగా కలిసే వాటితో పెద్ద ప్రమాదం లేదు కానీ సు లబంగా భూమిలో కలవని ప్లాస్టిక్ కవర్లను విచ్చల విడిగా పా  రవేస్తుండడంతో డ్రైనేజీలకు అడ్డుపడడం సముద్రంలో నదుల్లో చేరడం  జలచరాలకు విషం గా మారడం డ్రైనేజీ వ్యవస్థ కుప్పకూలి వరదలకు దారి తీయడం వంటి విష పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ఇక మానవ బాధ్యత రాహిత్య వినియోగం కారణంగా  ప్లాస్టిక్ కవర్లను ఎక్కడికక్కడ పడవేస్తూ ఉంటే వాటిని తిన్న పశువులు జలచరాలు  జంతువులు  అకారణంగా మృత్యువాత పడడం ఆందోళన కలిగించే సన్నివేశం కాదా?  అసాధారణమైనటువంటి జలచరాలు తాబేల్లు  చేపలు, డైనోసార్లు ఈ మైక్రో ప్లాస్టిక్ కారణంగా  అనేక రకాల పక్షులు కూడా  అంతరించిపోవడం  ప్రకృతికి జరుగుతున్న తీరనిద్రోహం.

 జాతీయ అంతర్జాతీయ స్థాయిలో  ప్లాస్టిక్ కట్టడికి జరిగిన కృషి  ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలు.

  రిసైక్లింగ్కు అవకాశం ఉన్నవి కాకుండా ఎక్కడికక్కడ ఒకసారి వాడి పడవేసే  ప్లాస్టిక్ ఉత్పత్తులతో  జరిగే నష్టాన్ని గుర్తించిన భారత  ప్రభుత్వం 2022లోనే వాటి ఉత్పత్తి వినియోగం పైన ఆంక్షలు విధించినది కానీ  వాటి అమలు కచ్చితంగా జరగని  కారణంగా వినియోగం యధావిధిగా కొనసాగుతూ ఉంటే జరుగుతున్న విషపరిణామాలకు కూడా అంతే లేకుండా పోయింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా అమలు చేయాల్సిన అవసరం ఈ విషయంలో ఎంతగానో ఉన్నది.  వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు, ప్రత్యామ్నాయ వినియోగాన్ని వాడకలోకి తెచ్చేందుకు,  ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ స్థాయిలో గత సంవత్సరం 170 దేశాలకు పైగా  చర్చలు  జరిపినప్పటికీ  ఒప్పందం  కుదరకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఆ ఒప్పందం ఎంత త్వరగా జరిగితే అంత మంచిది ఆ విషయంలో భారత ప్రభుత్వం ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం అంతర్జాతీయ సమాజం పైన ఎంతగానో ఉన్నది.
  ఇప్పటికైనా  జీవజాతుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్రమాదకర ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయల పైన పరిశోధనలు వేగవంతం చేయాల్సిన అవసరం పరిశోధకుల పైన చాలా ఉన్నది.ఆ వైపుగా ప్రభుత్వాలు పరిశోధనలకు హెచ్చు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్లాస్టిక్ వ్యర్థాలతోని రోడ్ల నిర్మాణము ద్వారా  ఖర్చులు తగ్గించడంతోపాటు నాణ్యతను పెంచవచ్చని విదేశాలలో రుజువైన నేపథ్యంలో అంతేకాకుండా భారతదేశంలో చెన్నై నోయిడా ముంబై వంటి చోట్ల కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మిస్తున్న అనుభవంతో దేశవ్యాప్తంగా పల్లె ప్రాంతాలకు సైతం ఈ విధానాన్ని విస్తరిస్తే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను అభివృద్ధి దిశగా మళ్ళించడానికి, కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.  ఈ  వ్యర్త  పదార్థాలతో డీజిల్ ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచవచ్చునని కొన్ని పరిశోధనలు రుజువు చేస్తున్న నేపథ్యంలో  వ్యర్థాల ద్వారా సంపదను సృష్టించడానికి ప్లాస్టిక్ నియంత్రణకు ఎంతో అవకాశం ఉన్నది. ఆ వైపుగా పాలకులు దృష్టిస్తారి o చడంతోపాటు ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా వీలైతే ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా కూడా దీని వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి, ప్రమాదకర పరిస్థితుల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. కావలసింది దేశాల పాలకులకు ప్రజలకు పౌర సమాజానికి ప్లాస్టిక్ అదుపు చేయడానికి సంబంధించిన చిత్తశుద్ధి మాత్రమే.


(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333