చట్టసభల పనితీరు ప్రజలకు అనుకూలంగా మార్చుకోవాలి.

Apr 7, 2025 - 08:30
 0  2

ప్రత్యక్ష ప్రసారాలు ప్రజల కోసమే కనుక ప్రజలు ఎరిగిన భాషలో చర్చ జరగాలి.* మూర్తీ భ వి o చిన నిండుతనం పాలక ప్రతిపక్షాలలో తొనికి సలాడాలి.

--  వడ్డేపల్లి మల్లేశం

  విద్యార్థి కేంద్రంగా విద్య కొనసాగినట్లు ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతుందని అందుకు అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వడం వాగ్దానాలు ప్రలోభాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం  చేయడం రోజురోజుకు నిత్య నూతనంగా మారిపోవడం వెనుక  అంతులేని విషాదగాతను మనం చూడవచ్చు. ప్రజాసమస్యలే  మా ఎజెండా అని ఒక రాజకీయ పార్టీ ప్రకటిస్తే, ప్రజలే మా దేవుళ్ళు  అని మరొక పార్టీ,ప్రజా సంపదకు మేము కావలి కుక్కలం అని ఒక రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ప్రకటిస్తే, మరొక పార్టీ ప్రజాధనానికి కాపలాదారులము సేవకులను మాత్రమేనని ప్రజలకు బాధ్యతాయుతంగా పారదర్శకంగా బాధ్యత వహించవలసిన అవసరం ఉండదని అందుకే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నికలను అందించిన మహా పురుషుడని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగలభాలు  పలకడానికి కూడా మనం గమనించవచ్చు. అయితే అంబేద్కర్ ఓటు హక్కును రాజ్యాంగబద్ధంగా కల్పించిన సందర్భంలో మాట్లాడుతూ రాజు నుండి పేద వరకు కోటీశ్వరుని నుండి అట్టడుగు వర్గాల వరకు అందరికీ ఒకే ఓటు హక్కును కల్పించడం జరిగింది ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా యజమాని  గా మారుతావా లేదా బానిసగా  తాత్కాలిక ప్రయోజనాల కోసమే ఆరాటపడతావా? తేల్చుకోవాల్సింది ఓటర్లే అని చేసిన హెచ్చరిక 75 ఏళ్ల తర్వాత కూడా గణతంత్ర రాజ్యంలో హెచ్చరిక గానే మిగిలిపోయింది. అంటే రాజకీయ చిత్రాన్ని ప్రజల జీవన విధానాన్ని రాజ్యాంగ రచన తీరును అందులోని ఆర్టికల్స్ లేదా ప్రవేశికను ప్రజలకు అవగాహన చేయించే ప్రయత్నం చేయలేదు మేధావులు కూడా అలాంటి  ప్రయత్నం చేయలేదేమో అనే సందేహం రాక మానదు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి  అసెంబ్లీ శాసనమండలి సభల యొక్క పనితీరును ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపిస్తున్న తరుణంలో  తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన ఈ రెండు రాష్ట్రాలలోనూ తెలుగు భాషను పక్కనపెట్టి మాతృభాష అయినటువంటి తెలుగును అవమానపరిచి తామేదో పెద్దగా ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పుకొని హిందీ ఇంగ్లీషులో మాట్లాడే ఒక దుర్మార్గపు సంస్కృతిని కూడా మనము కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది.
 ఎందుకంటే మెజారిటీ ప్రజలు తెలుగు వాళ్ళు కనుక వాళ్ల కోసమే ఈ ప్రసారాలు కొనసాగాలి .చట్టసభల్లో మంత్రులు ప్రవేశపెట్టే అటువంటి బిల్లులు  వాటిని ఆమోదించే విధానము వాటిపైన జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా సభ్యుల యొక్క  భాగస్వామ్యాన్ని పరిశీలించినప్పుడు  అంశం పైన చర్చించకుండా తమకు తెలిసిన భాషలో మాట్లాడడం ద్వారా  సరైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉండదు. మంత్రి లేదా ప్రభుత్వము లేదా ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఆ ఇతర భాషల్లోని చర్చ రాకపోయే ప్రమాదం కూడా ఉంటుంది  తెలుగు భాషతో అంతగా పరిచయం లేనటువంటి ముస్లిం సోదరులు ఇతరులు ఆంగ్లంలో మాట్లాడవచ్చు లేదా ఇందులో మాట్లాడవచ్చు కానీ  తెలుగు భాషతో నిత్యం అనుబంధమున్న వాళ్లు కూడా పెద్దరికం కోసం  తెలుగును పక్కన పెట్టడం అంటే అది సహించరాని నేరం  భాష తమ వృత్తి తమ కులం తమ మతం ఏదైనా  తెలుగులోనే ఆమోదించాలి అంతెందుకు బిల్లు ఆమోదం పొందే సమయంలో స్పీకర్ గారు బిల్లు అంశాన్ని ప్రస్తావిస్తూ  ఆమోదించాలని కోరిన సందర్భంలో మాట్లాడే వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలోనే ఉండడం నిజంగా మన తెలుగు భాషకు పట్టిన దౌర్భాగ్య పరిస్థితికి దర్పణం అంటే అతిశయోక్తి కాదు.  ఇక అసెంబ్లీలో జరిపినటువంటి చర్చల అనంతరం బిల్లుల ఆమోదంతో వెలువడుతున్నటువంటి ఉత్తర్వులను కూడా ఆంగ్లంలోనే ప్రవేశపెట్టడం పైన మాజీ ఉపరాష్ట్రపతి  తెలుగు భాషా పిపాసి  ఎం వెంకయ్య నాయుడు గారు  ప్రభుత్వాలు తెలుగు భాషను ఆత్మీయంగా గౌరవంగా అమలు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. అనేక పాఠశాలల్లో ఇప్పటికీ కూడా తెలుగు ఒక బోధనా భాషగా లేకపోవడం విడ్డూరం అవమానకరం హేళన అంటే అతిశయోక్తి కాదు ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి కూడా తమిళ మాధ్యమంలో సిలబస్ను భాష బోధనను టెక్నికల్ పదజాలాన్ని  రూపొందించి అమలు చేసి తమ భాషా చిత్తశుద్ధిని చాటుకున్న సందర్భం తెలుగు భాషా ప్రేమికులకు తెలియదా? తెలుగు భాషను అభిమానించే చట్టసభల్లోని స్పీకర్ ముఖ్యమంత్రి మంత్రులకు బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులకు ఈ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం.
        కొందరు మంత్రులు  కొన్ని సందర్భాలలో స్పీకర్ గారు  మరికొన్ని సందర్భాలలో ఇతర భాషా ప్రేమికులు తెలుగును పక్కనపెట్టి తమ భాషను ఉద్ధరించినట్లుగా మాట్లాడి తెలుగు ప్రేమికులకు  విరక్తి కలిగేలా వ్యవహరించడం అనేది సరియైనది కాదు.  ఇప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నత విద్యకు సంబంధించి తెలుగు మాధ్యమము ద్వారా అవగాహన చేయించడానికి సంబంధించి ఎలాంటి కృషి జరగలేదు అదే తమిళనాడు రాష్ట్రంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో పాటు అక్కడి భాషా ప్రేమికులు తమిళ మాధ్యమములో సాంకేతిక పదజాలాన్ని కూడా విద్యార్థులకు సులువుగా ఆకలింపు చేసుకోవడానికి అందించడం జరిగింది. ప్రపంచంలోని జర్మనీ  చైనా లాంటి అనేక భాషలో కూడా  అంతర్జాతీయ స్థాయిలో తమ శిక్షణ విజ్ఞానాన్ని పొందుతున్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆంగ్లము మాత్రమే  రారాజు అని చెప్పడానికి వీలులేదు అంతర్జాతీయ భాష కావచ్చు కానీ అంతర్జాతీయ భాషను నేర్చుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండబోదు అవసరమైతే రెండు పీరియడ్లను కేటాయించడం ద్వారా ఆంగ్ల మాధ్యమం పైన సబికులకు స్పీకర్కు ముఖ్యమంత్రికి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రజలందరికీ కూడా ఆంగ్ల భాష ప్రావీణ్యాన్ని అందిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. కానీ  తమ మాతృభాష అయిన తెలుగులోనే స్పష్టమైనటువంటి పదజాలాలను పలకడానికి  ఇష్టపడని పదాలు దొరకని దౌర్భాగ్య పరిస్థితుల నుండి  బయట పడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి చ ట్ట సభలు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.  చట్టసభల్లో ప్రజల యొక్క సాధక బాధకాలు ప్రజాసంక్షేమం రాష్ట్ర అభివృద్ధి పైన చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి చర్చ సంప్రదింపులు  ఆలోచనలు భిన్నాభిప్రాయాలు  ప్రత్యామ్నాయ పరిస్థితుల పైన కూడా ప్రజలకు స్పష్టమైన అవగాహన కలిగించడానికి తప్పనిసరిగా ప్రసారాలను తెలుగులోనే అందించడం చాలా అవసరం.  ఆ స్పృహ సోయి కనీసమైన జ్ఞానము ఆ నేపథ్యం ప్రభుత్వాలకు లేకపోతే  ఎలా?


చట్టసభల్లో పాలక ప్రతిపక్షాల వైఖరి మారాలి

ఒక రాజకీయ పార్టీకి లేదా పాలక పార్టీకి ప్రజలే గీటురాయి కానీ  ప్రజల పేరు చెప్పుకొని ప్రతిపక్షాలను కు o  గదీసి వాళ్లను అవమానించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజా ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉండదు పైగా ప్రజల ముందు రాజకీయ పార్టీలు ద్రోహులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తన అత్యాశతో అనేక ఉచితాలు  వాగ్దానాలను ప్రవేశపెట్టి ఇతర రాజకీయ పార్టీ కంటే మిన్నగా హామీలు ఇచ్చిన సందర్భం ఉంటే ఉండవచ్చు కానీ  నిబద్ధత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి  నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారి  నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య వైద్యాన్ని ప్రజలకు అందించడం ద్వారా తమ చిత్తశుద్ధిని  చాటుకోవడానికి సత్తా చూపినట్లయితే బాగుంటుంది..  దయ నీ  యమైన పరిస్థితి ఏమిటంటే ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము కానీ ఏ రాజకీయ పార్టీ కానీ నాణ్యమైన విద్య వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో ఉచితంగా ప్రజలకు అందిస్తామని  ప్రకటించకపోవడంతో పాటు ఆ ప్రాధాన్యతను గుర్తించకపోవడం సిగ్గుచేటు. ఈ విషయం పైన చట్టసభల్లో స్పష్టంగా చర్చ జరగాలి. 6 గ్యారంటీలు ఎలా ఇస్తావు? 420 హామీలు ఎలా చేస్తావు? మహిళలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? అని కాకుండా  ఉచిత విద్య ఉచిత వైద్యము నాణ్యమైన స్థాయిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వపరంగా ప్రకటన జరగాలి అది దేశం మొత్తానికి ఆదర్శం కావాలి అని చెప్పగలిగిన ఒక్క రాజకీయ పార్టీ,ప్రతిపక్షం కనిపించిందా? అదే సందర్భంలో ఒక్క పాలక ప్రభుత్వం కూడా మనకు తారసపడిందా అర్థం చేసుకోవచ్చు.అందుకే చట్టసభల్లో ప్రతిపక్ష పాలక పక్షాలు తమ నిబద్ధతను చాటుకోవాలి  బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజల పక్షాన నిలబడాలి తమ ఉనికి కోసం తమ ఆధిపత్యం కోసం తమ  అధికార దాహం కోసం కాకుండా ప్రజల కోసమే పని చేయగలిగినటువంటి రాజకీయ పార్టీల యొక్క  ఉనికి నేడు తెలుగు రాష్ట్రాలలో కల్లారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు భిన్నంగా అధికార ప్రభుత్వాలు నడిస్తే రాబోయే కాలంలో ప్రజల చేతిలో పరాభవం తప్పదు  అందుకు సంబంధించి చట్టసభల్లో నిర్వహించవలసినటువంటి కర్తవ్యాలను ప్రభుత్వం ముందుగానే మేధావులతో చర్చించి స్వీకరిస్తే బాగుంటుంది .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333