పాలన  పై ప్రజల ముద్ర పాలన  పై ప్రజల ముద్ర ఉండాలి కానీ పాలకుల ముద్ర కాదు.

Jun 7, 2024 - 15:32
Jun 8, 2024 - 18:59
 0  8
పాలన  పై ప్రజల ముద్ర పాలన  పై ప్రజల ముద్ర ఉండాలి కానీ పాలకుల ముద్ర కాదు.

కెసిఆర్ ఆనవాలు లేకుండా చేస్తున్నారని  ఆరోపించడంలో  ప్రజల ఆకాంక్షల కంటే తమ అధికారమే ముఖ్యమని  భావించినట్లే కదా!*  తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో  తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది, కాపాడవలసినదానిపై చర్చ జరగాలి...

---- వడ్డేపల్లి మల్లేశం 

ప్రజల అవసరాలు ప్రయోజనాలు ఆకాంక్షలకు అనుగుణంగా  పాలకులు రాజులు ఎవరూ చేసినా ఆ పాలన పైన ప్రజా ముద్ర ఉన్నది అని చెబితే అర్థవంతంగా ఉంటుంది . కానీ దానికి భిన్నంగా ముఖ్యంగా రాజుల కాలంలో తమ ఆధిపత్యాన్ని తమ  ప్రత్యేకతను మాత్రమే చాటుకొని చరిత్రలో కలకాలం నిలవాలని ఆశించిన వాళ్లు కొందరు ప్రజలను విస్మరించి ద్రోహులుగా మిగిలిపోయినారు  అలాంటి వ్యక్తిగత రాచరిక  ముద్ర మనకు అవసరం లేదు కానీ నేటి ప్రజాస్వామ్య యుగములో కూడా రాచరికపు పోకడలో  ఆలోచించేవారు ఉన్నారు.

 వారి గురించి ఏం మాట్లాడదాం ? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిహ్నము గేయము  తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు    పాలన పైన తెలంగాణ సాధన పైన కెసిఆర్ ముద్ర లేకుండా చేయడం కోసమే  కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని , తెలంగాణ గీతం చిహ్నం తెలంగాణ తల్లి  మార్పులు చేయడం అంటే తమ అస్తిత్వాన్ని  కోల్పోవడమేనని కేసీఆర్ భావిస్తున్నట్లుగా  ప్రకటించడం నిజంగా ప్రజాస్వామ యుగంలో  అర్థరహితం  ఒక ప్రభుత్వ హయా ములో  తీసుకోవలసిన నిర్ణయాన్ని విస్మరించినప్పుడు తర్వాత వచ్చే ప్రభుత్వాలు కచ్చితంగా  ప్రజల ఒత్తిడి ప్రజల ఆకాంక్షలు  మేధావుల సూచనల మేరకు  కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం   సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం అదే.  పాలనలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తున్నారని కేసీఆర్ ఆవేదన పడుతున్నాడు అంటే కేవలం తమ అధికారం ముద్ర కోసం మాత్రమే పాకు లాడినట్టు కానీ ప్రజా సంక్షేమం అభివృద్ధిని విస్మరించినట్టే అర్థం చేసుకోవలసి ఉంటుంది. అందుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు .

తెలంగాణ ఉనికి కోసం ఎవరేం చేశారు :- 

B R S రాచరిక భూస్వామ్య లక్షణాలను కలిగి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని  పలువురు మేధావులు విశ్లేషకులు విమర్శిస్తున్న వేళ  సగటు తెలంగాణ కార్మిక కర్షకురాలి రూపంలో వుండాల్సిన అవసరం ఉన్నది అనీ రూడీ అయినది . ఇక తెలంగాణ చిహ్నంలో  అమరవీరుల స్థూపం లేకపోవడం విచారకరం  తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా సబ్బండ వర్గాల ఉమ్మడి పోరాటంతో పాటు ఆనాడు ఉర్రూతలూగించిన అందెశ్రీ జయ జయహే తెలంగాణ గీతాన్ని   గుర్తించక గౌరవించక అగౌరవపరిచి రాష్ట్ర గీతంగా ఆమోదించనటువంటి తీరు గర్హనీయం.  ఇప్పటికీ 69 ఉద్యమంలో చనిపోయిన వాళ్ళతో పాటు మలి తుది దశ ఉద్యమాలలో  బలిదానాలు అమరులైనటువంటి ఉద్యమకారుల  జాబితా రూపొందించకపోవడం  వారికి తగిన ఆర్థిక సహాయం గుర్తింపు ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వకపోవడం కూడా  తెలంగాణ పోరాట స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుంటే బాధాకరమే . ముఖ్యంగా మలి తుది దశ పోరాట కాలం లోపల తెలంగాణ ప్రాంత యువత పైన పెట్టినటువంటి కేసులు  ఇప్పటికీ రద్దు చేయకపోవడం సిగ్గుచేటు . నక్సలైట్ల పేరుతో అనేకమంది పైన కేసులు నమోదు చేసినట్లు ఉద్యమకారుల సమ్మేళనంలో వాపోతుంటే పదేళ్లు స్వీయ పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం కేసులను కొట్టివేయకపోవడం  ఎంత బాధ్యతారాహిత్యమో అర్థం చేసుకోవచ్చు.  

 ఇక ఉద్యమంలో పని చేసినటువంటి కుటుంబాలు బలిదానాలకు పాల్పడినటువంటి కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితులు అద్వాన్న పరిస్థితిలో ఉన్నప్పటికీ వాళ్లకు ఎలాంటి ఉపాధి చూపకుండా నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం  ప్రజా ఆకాంక్షల మేరకు పరిపాలన ఎలా అవుతుంది?.  ఉద్యమకారులకు పెన్షన్ , గృహవసథి, ఇంటి స్థలం కానీ  వారి ఆరోగ్య పరిస్థితులను ప్రభుత్వం  బాధ్యతగా గుర్తించడం కానీ జరగకపోవడం  అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా తెలంగాణ అస్తిత్వాన్ని వెతుక్కోవడమే కదా!  69 అమరవీళ్ల స్థూప నిర్మాత  మేస్త్రి ఈరోజు చావు బతుకులో ఉన్నాడని ఇటీవల ప్రముఖ  తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి గారు  ఆందోళన వ్యక్తం చేయడం  పాలకుల యొక్క   నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా ?

 విద్యా వైద్యం వంటి ముఖ్యమైన అంశాలను పక్కనపెట్టి పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించి రైతుబంధు పేరుతో భూస్వాములకు అప్పనంగా ప్రజాధనాన్ని కట్టబెట్టి  కాయిలా పడిన పరిశ్రమలను తెరిపించక ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించినటువంటి గత పదిఏళ్ల తెలంగాణ ప్రభుత్వం  చేసిన విధ్వంసం వల్ల తెలంగాణ అంటే ఏమిటి? తెలంగాణ రూపం ఎలా ఉండాలి? అనీ చర్చించుకోవాల్సిన రావడం చాలా విచారకరం .ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ముందున్న బాధ్యతలను ఒక్కసారి పరిశీలన చేద్దాం  .

గత ప్రభుత్వ తప్పిదం  నేటి ప్రభుత్వానికి అదన బాధ్యత  :-

ఎప్పుడైనా ఒక పాలన వ్యవస్థ ప్రజలకు అనుగుణంగా  ఆదర్శంగా కొనసాగినప్పుడు రాబోయే  ప్రభుత్వాలకు ఈ పరిపాలన అంశాలు ఆనవాళ్లుగా ఉంటాయి . వీటి పునాది పైన కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు కానీ  తెలంగాణ రాష్ట్రంలో గతంలో కొనసాగిన ప్రభుత్వం కేవలం చరిత్ర కోసం మాత్రమే,,,,, చరిత్ర అంటే తమకే తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తామేనని, ప్రజల ప్రమేయం లేదని కొత్త నినాదాన్ని తీసుకువచ్చి  తమ ముద్ర వేసుకున్న కారణంగా అనివార్య పరిస్థితుల్లో ఆ ముద్రను తొలగించవలసి వస్తున్నది. ప్రజా కోణంలో  పాలనను, తెలంగాణ అస్థిత్వాన్ని, తెలంగాణ సంస్కృతిని పునర్నిర్మానం చేసుకోవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.  రాష్ట్ర గీతానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం  అధికార చిహ్నం తెలంగాణ తల్లి విషయంలో కమిటీని వేసి నిపుణులతో ఆ కమిటీ రిపోర్ట్ ల మేరకు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

 అమరవీరుల కుటుంబాలను గుర్తించాలి, ఆదరించాలి ,గౌరవించాలి, వారి గురించిన ప్రత్యేక బుల్లెట్ అని విడుదల చేయాలి.  అమరవీరుల కుటుంబాలకు పెన్షన్  ఉద్యమకారులకు పెన్షన్  ఇంటి సౌకర్యం కనీస అవసరాలను ప్రభుత్వమే కల్పించాలి  .ఇంతకాలం ఆర్థిక అరాచకత్వం  ఏకపక్ష నియంతృత్వ ప్రభుత్వం నిర్బంధ అణచివేత  కొనసాగిన అంశాల పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి . ఫోన్ టాపింగ్ తో పాటు  గొర్రెల పంపిణీ వంటి అనేక ప్రభుత్వ పథకాల్లో కోటానుకోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా తెలుస్తున్నది.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అంశం పైన  ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం  పైన విచారణ జరిపించి కేవలం అధికారులను మాత్రమే బాధ్యులను చేయకుండా ఆనాటి పాలకులను  బాధ్యులను చేసి పరిహారాన్ని రాబట్టి శిక్షించాలి.

  విద్యా వైద్య రంగాలను  ప్రాధాన్యత క్రమము లోపల  నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి  నిపుణులతో కమిటీలను వేసి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది.  ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల పేరుతో పండుగ జరుపుకోవడం ఒక ఎత్తు అయితే రాబోయే కాలంలో చేయబోయే పనుల పైన దృష్టి సారించడం సమీక్షించుకోవడం గత ప్రభుత్వానికి భిన్నంగా విమర్శలకు ఆస్కారం లేకుండా పరిపాలన చేయవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉన్నది.  ఆ క్రమంలో విప్లవకార్లు, మేధావులు, ప్రజాసంఘాలు, విప్లవ రచయితల వంటి  సామాజిక సంఘాలను  కలుపుకొని పోవాలి అప్పుడే ప్రభుత్వం తన మనవడ మరింత ఉత్కృష్టంగా కొనసాగించే అవకాశం ఉంటుంది.  పదేళ్ల కాలంలో తెరాస రాష్ట్రాన్ని అప్పల కుప్పగా చేయడంతో పాటు అస్తిత్వాన్ని  నీరుగార్చే విషయం పైన  స్పష్టతనివ్వడం కోసం  ప్రస్తుత ప్రభుత్వం తన ముద్ర కాకుండా ప్రజల ముద్ర కోసం ఆరాటపడినట్లయితే  పాలన గాడిలో కొనసాగుతుంది.  అధికారం, ఆదిపత్యం,  కొన్ని వర్గాలకే రాజ్యాధికారంలో వాటా కోసం  తపన పడితే మాత్రం పాలకులు ఎప్పుడైనా శిక్షార్హులే  .

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

కానీ పాలకుల ముద్ర కాదు.*  కెసిఆర్ ఆనవాలు లేకుండా చేస్తున్నారని  ఆరోపించడంలో  ప్రజల ఆకాంక్షల కంటే తమ అధికారమే ముఖ్యమని  భావించినట్లే కదా!*  తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో  తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది, కాపాడవలసినదానిపై చర్చ జరగాలి...*
**********
---- వడ్డేపల్లి మల్లేశం  9014206412
---01...06...2024*****
ప్రజల అవసరాలు ప్రయోజనాలు ఆకాంక్షలకు అనుగుణంగా  పాలకులు రాజులు ఎవరూ చేసినా ఆ పాలన పైన ప్రజా ముద్ర ఉన్నది అని చెబితే అర్థవంతంగా ఉంటుంది . కానీ దానికి భిన్నంగా ముఖ్యంగా రాజుల కాలంలో తమ ఆధిపత్యాన్ని తమ  ప్రత్యేకతను మాత్రమే చాటుకొని చరిత్రలో కలకాలం నిలవాలని ఆశించిన వాళ్లు కొందరు ప్రజలను విస్మరించి ద్రోహులుగా మిగిలిపోయినారు  అలాంటి వ్యక్తిగత రాచరిక  ముద్ర మనకు అవసరం లేదు కానీ నేటి ప్రజాస్వామ్య యుగములో కూడా రాచరికపు పోకడలో  ఆలోచించేవారు ఉన్నారు వారి గురించి ఏం మాట్లాడదాం ? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిహ్నము గేయము  తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు    పాలన పైన తెలంగాణ సాధన పైన కెసిఆర్ ముద్ర లేకుండా చేయడం కోసమే  కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని , తెలంగాణ గీతం చిహ్నం తెలంగాణ తల్లి  మార్పులు చేయడం అంటే తమ అస్తిత్వాన్ని  కోల్పోవడమేనని కేసీఆర్ భావిస్తున్నట్లుగా  ప్రకటించడం నిజంగా ప్రజాస్వామ యుగంలో  అర్థరహితం  ఒక ప్రభుత్వ హయా ములో  తీసుకోవలసిన నిర్ణయాన్ని విస్మరించినప్పుడు తర్వాత వచ్చే ప్రభుత్వాలు కచ్చితంగా  ప్రజల ఒత్తిడి ప్రజల ఆకాంక్షలు  మేధావుల సూచనల మేరకు  కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం   సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం అదే.  పాలనలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తున్నారని కేసీఆర్ ఆవేదన పడుతున్నాడు అంటే కేవలం తమ అధికారం ముద్ర కోసం మాత్రమే పాకు లాడినట్టు కానీ ప్రజా సంక్షేమం అభివృద్ధిని విస్మరించినట్టే అర్థం చేసుకోవలసి ఉంటుంది. అందుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు .
     తెలంగాణ ఉనికి కోసం ఎవరేం చేశారు :-
**********B R S
రాచరిక భూస్వామ్య లక్షణాలను కలిగి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని  పలువురు మేధావులు విశ్లేషకులు విమర్శిస్తున్న వేళ  సగటు తెలంగాణ కార్మిక కర్షకురాలి రూపంలో వుండాల్సిన అవసరం ఉన్నది అనీ రూడీ అయినది . ఇక తెలంగాణ చిహ్నంలో  అమరవీరుల స్థూపం లేకపోవడం విచారకరం  తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా సబ్బండ వర్గాల ఉమ్మడి పోరాటంతో పాటు ఆనాడు ఉర్రూతలూగించిన అందెశ్రీ జయ జయహే తెలంగాణ గీతాన్ని   గుర్తించక గౌరవించక అగౌరవపరిచి రాష్ట్ర గీతంగా ఆమోదించనటువంటి తీరు గర్హనీయం.  ఇప్పటికీ 69 ఉద్యమంలో చనిపోయిన వాళ్ళతో పాటు మలి తుది దశ ఉద్యమాలలో  బలిదానాలు అమరులైనటువంటి ఉద్యమకారుల  జాబితా రూపొందించకపోవడం  వారికి తగిన ఆర్థిక సహాయం గుర్తింపు ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వకపోవడం కూడా  తెలంగాణ పోరాట స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుంటే బాధాకరమే . ముఖ్యంగా మలి తుది దశ పోరాట కాలం లోపల తెలంగాణ ప్రాంత యువత పైన పెట్టినటువంటి కేసులు  ఇప్పటికీ రద్దు చేయకపోవడం సిగ్గుచేటు . నక్సలైట్ల పేరుతో అనేకమంది పైన కేసులు నమోదు చేసినట్లు ఉద్యమకారుల సమ్మేళనంలో వాపోతుంటే పదేళ్లు స్వీయ పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం కేసులను కొట్టివేయకపోవడం  ఎంత బాధ్యతారాహిత్యమో అర్థం చేసుకోవచ్చు.  ఇక ఉద్యమంలో పని చేసినటువంటి కుటుంబాలు బలిదానాలకు పాల్పడినటువంటి కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితులు అద్వాన్న పరిస్థితిలో ఉన్నప్పటికీ వాళ్లకు ఎలాంటి ఉపాధి చూపకుండా నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం  ప్రజా ఆకాంక్షల మేరకు పరిపాలన ఎలా అవుతుంది?.  ఉద్యమకారులకు పెన్షన్ , గృహవసథి, ఇంటి స్థలం కానీ  వారి ఆరోగ్య పరిస్థితులను ప్రభుత్వం  బాధ్యతగా గుర్తించడం కానీ జరగకపోవడం  అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా తెలంగాణ అస్తిత్వాన్ని వెతుక్కోవడమే కదా!  69 అమరవీళ్ల స్థూప నిర్మాత  మేస్త్రి ఈరోజు చావు బతుకులో ఉన్నాడని ఇటీవల ప్రముఖ  తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి గారు  ఆందోళన వ్యక్తం చేయడం  పాలకుల యొక్క   నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా ? విద్యా వైద్యం వంటి ముఖ్యమైన అంశాలను పక్కనపెట్టి పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించి రైతుబంధు పేరుతో భూస్వాములకు అప్పనంగా ప్రజాధనాన్ని కట్టబెట్టి  కాయిలా పడిన పరిశ్రమలను తెరిపించక ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించినటువంటి గత పదిఏళ్ల తెలంగాణ ప్రభుత్వం  చేసిన విధ్వంసం వల్ల తెలంగాణ అంటే ఏమిటి? తెలంగాణ రూపం ఎలా ఉండాలి? అనీ చర్చించుకోవాల్సిన రావడం చాలా విచారకరం .ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ముందున్న బాధ్యతలను ఒక్కసారి పరిశీలన చేద్దాం  .
       గత ప్రభుత్వ తప్పిదం  నేటి ప్రభుత్వానికి అదన బాధ్యత  :-
**""
ఎప్పుడైనా ఒక పాలన వ్యవస్థ ప్రజలకు అనుగుణంగా  ఆదర్శంగా కొనసాగినప్పుడు రాబోయే  ప్రభుత్వాలకు ఈ పరిపాలన అంశాలు ఆనవాళ్లుగా ఉంటాయి . వీటి పునాది పైన కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు కానీ  తెలంగాణ రాష్ట్రంలో గతంలో కొనసాగిన ప్రభుత్వం కేవలం చరిత్ర కోసం మాత్రమే,,,,, చరిత్ర అంటే తమకే తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తామేనని, ప్రజల ప్రమేయం లేదని కొత్త నినాదాన్ని తీసుకువచ్చి  తమ ముద్ర వేసుకున్న కారణంగా అనివార్య పరిస్థితుల్లో ఆ ముద్రను తొలగించవలసి వస్తున్నది. ప్రజా కోణంలో  పాలనను, తెలంగాణ అస్థిత్వాన్ని, తెలంగాణ సంస్కృతిని పునర్నిర్మానం చేసుకోవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.  రాష్ట్ర గీతానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం  అధికార చిహ్నం తెలంగాణ తల్లి విషయంలో కమిటీని వేసి నిపుణులతో ఆ కమిటీ రిపోర్ట్ ల మేరకు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
      అమరవీరుల కుటుంబాలను గుర్తించాలి, ఆదరించాలి ,గౌరవించాలి, వారి గురించిన ప్రత్యేక బుల్లెట్ అని విడుదల చేయాలి.  అమరవీరుల కుటుంబాలకు పెన్షన్  ఉద్యమకారులకు పెన్షన్  ఇంటి సౌకర్యం కనీస అవసరాలను ప్రభుత్వమే కల్పించాలి  .ఇంతకాలం ఆర్థిక అరాచకత్వం  ఏకపక్ష నియంతృత్వ ప్రభుత్వం నిర్బంధ అణచివేత  కొనసాగిన అంశాల పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి . ఫోన్ టాపింగ్ తో పాటు  గొర్రెల పంపిణీ వంటి అనేక ప్రభుత్వ పథకాల్లో కోటానుకోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా తెలుస్తున్నది.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అంశం పైన  ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం  పైన విచారణ జరిపించి కేవలం అధికారులను మాత్రమే బాధ్యులను చేయకుండా ఆనాటి పాలకులను  బాధ్యులను చేసి పరిహారాన్ని రాబట్టి శిక్షించాలి.  విద్యా వైద్య రంగాలను  ప్రాధాన్యత క్రమము లోపల  నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి  నిపుణులతో కమిటీలను వేసి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది.  ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల పేరుతో పండుగ జరుపుకోవడం ఒక ఎత్తు అయితే రాబోయే కాలంలో చేయబోయే పనుల పైన దృష్టి సారించడం సమీక్షించుకోవడం గత ప్రభుత్వానికి భిన్నంగా విమర్శలకు ఆస్కారం లేకుండా పరిపాలన చేయవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉన్నది.  ఆ క్రమంలో విప్లవకార్లు, మేధావులు, ప్రజాసంఘాలు, విప్లవ రచయితల వంటి  సామాజిక సంఘాలను  కలుపుకొని పోవాలి అప్పుడే ప్రభుత్వం తన మనవడ మరింత ఉత్కృష్టంగా కొనసాగించే అవకాశం ఉంటుంది.  పదేళ్ల కాలంలో తెరాస రాష్ట్రాన్ని అప్పల కుప్పగా చేయడంతో పాటు అస్తిత్వాన్ని  నీరుగార్చే విషయం పైన  స్పష్టతనివ్వడం కోసం  ప్రస్తుత ప్రభుత్వం తన ముద్ర కాకుండా ప్రజల ముద్ర కోసం ఆరాటపడినట్లయితే  పాలన గాడిలో కొనసాగుతుంది.  అధికారం, ఆదిపత్యం,  కొన్ని వర్గాలకే రాజ్యాధికారంలో వాటా కోసం  తపన పడితే మాత్రం పాలకులు ఎప్పుడైనా శిక్షార్హులే  .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333