ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

Dec 24, 2024 - 19:35
Dec 24, 2024 - 22:39
 0  44
ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

*ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం*

అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలనిర్వహణ.

రైతును రాజు చేయడమే సీఎం ఉద్దేశం.

మహిళలకు పెద్దపీట.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్న ప్రజా ప్రభుత్వం.

17 కోట్ల 98 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న రోడ్ల పనుల శంకుస్థాపనలు 

ములుగు తెలంగాణ వార్త డిసెంబర్ 24:- రోడ్లను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ నూతన రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

మంగళవారం జిల్లాలోని కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట మండలంలలో 17 కోట్ల 98 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న రోడ్లు, నూతన భవన నిర్మాణాల పనులకు రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్ పి షభరిష్, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ భవనాలు లేనిచోట నూతన పరిజ్ఞానంతో భవనాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 

రాష్ట్రంలోని రైతులను రాజులను చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేశారని, రానున్న రోజులలో రైతు బంధు అందించడంతో పాటు భూమిలేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు అందజేయడానికి ప్రభుత్వ నిర్ణయించిందని అన్నారు. 

మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఉద్దేశంతో మహిళల కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని, ఇప్పటికే రాష్ట్రంలో 52 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించగా, మన జిల్లాలో 187 మంది ఉపాధ్యాయులుగా, 40 మంది పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదింటి వారికి ప్రభుత్వ పథకాలను అందజేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా నేటి ప్రజా ప్రభుత్వం ప్రతి గంటకు మూడు కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని, అయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే సంక్షేమ ఫలాలను అర్హులకు అందిస్తున్నామని అన్నారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంతో సర్వే కొనసాగుతున్నదని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కన్నాయిగూడెం మండల కేంద్రంలో లైబ్రరీ సెంటర్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటానని సీతక్క తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారు,ఆర్డీఓ వెంకటేష్, పంచాయితి రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, 

తదితరులు పాల్గొన్నారు.

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్