కోటమర్తిలో ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన వైస్ చైర్మన్ నర్సిరెడ్డి,మండల అధికారులు

అడ్డగూడూరు 10 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా విచేసిన మండల తాసిల్దార్ శేషగిరిరావు కొబ్బరికాయ కొట్టి రూబెన్ కట్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు అగ్రికల్చరల్ అధికారి పాండురంగ చారి,ఏపీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దని అన్నారు.ప్రభుత్వం కొనుగోలు ధర ఏ గ్రేడ్ 2320రు"బి గ్రేడ్ 2300రు"కొనుగోలు చేస్తుంది అని అన్నారు. రైతులు పండించిన పంట తేమ,తాలు లేకుండా కాంటాకు వేయాలని అన్నారు.అవసరమైతే రెండు మూడు రోజులు ఎండబెట్టిన తర్వాతే తూకం వేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి,గ్రామ మాజీ సర్పంచ్ చిప్పలపల్లి బాలు,మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్లు బాలెoల విద్యాసాగర్,చిత్తలూరి సోమయ్య,కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ,యాదయ్య,ప్రసాద్ మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు అల్లే కల్పన,విబికే,మండల నాయకులు మేకల పవన్,గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ మహిళలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.