ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లను అలమరుచుకోవాలి సీఐ నాగేశ్వరరావు

తిరుమలగిరి 24 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుమలగిరి పోలీస్ ఆధ్వర్యంలో స్థానిక బాలికల మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నందు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తిరుమలగిరి ఎస్సై వెంకటేశ్వర్లు హాజరై విద్యార్థులకు సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లను అలవర్చుకోవాలని చెడు ప్రభావానికి గురి అవ్వద్దని కోరారు. పిల్లలపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ప్రయోజకులై ఆసరా అవుతారు అని నమ్మకంతో అంటారు వాటిని నెరవేర్చడం పిల్లల బాధ్యత అన్నారు. మన బాధ్యత లక్ష్యాలను గుర్తించి వాటి సాధనకు క్రమశిక్షణతో పట్టుదలతో నిరంతర కృషి చేసి విజయం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమం నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.