విద్యార్థులు మత్తు పానీయాలకు గురికావద్దు ఎస్సై కె వెంకటరెడ్డి 

Jul 25, 2025 - 19:18
 0  14

అడ్డగూడూరు 25జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని విద్యార్థులకు వివిధ గ్రామాల ప్రజలకు డ్రగ్స్ మద్యపానం హెల్మెట్ లేకుండా 18 సంవత్సరాలు నిండకుండానే వాహనాలు ద్విచక్ర వాహనం నడిపపే వారికి ఎస్సై వెంకట్ రెడ్డి ఆహ్వానం కార్యక్రమం శుక్రవారం రోజు నిర్వహించారు.డ్రగ్స్ కు అలవాటు పడ్డ విద్యార్థులు కానీ ఊర్లో ఎవరైనా కానీ సమాచారం తెలిస్తే100 నెంబర్ కు కాల్ చేయవలసిందిగా అని అన్నారు. వారిని మేము పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వినకపోతే కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తాం మరి మరి మేము చెప్పేది ఏందంటే 18 సంవత్సరాల నిండకముందుకే వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకొని వారిని జైలుకు పంపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకు తల్లిదండ్రులు చేయవలసిందల్లా ఏమిటి అంటే18 సంవత్సరాల నుండిన తర్వాతే లైసెన్స్ వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు బండి ఇవ్వవాలని కోరారు.నెంబర్ ప్లేట్  ఆర్ సి,ఇన్సూరెన్స్, లేకుండా వాహనం నడిపితే కేసులు పాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని అన్నారు.ముఖ్యంగా విద్యార్థులు ఫోన్లకు అలవాటు పడకూడదు మీ విలువైన సమయాన్ని వృధా చేయకూడదు మీరు ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చూడకుండా చదువుకోవాలి లేదా రాసుకోవాలి టైం చూసుకుని ఆటలాడుకోవాలి కానీ ఫోన్లు పట్టుకొని చూస్తే మీ తల్లిదండ్రు ఫోన్లో దాచుకున్న10,వేలు 20,వేలు ఉంటే తెలిసి తెలవక ఏదో ఒకటి ఒత్తితే ఫోన్లో నుండి డబ్బులు పోవడం జరుగుతుంది అని అన్నారు.అంబేద్కర్ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం చుట్టు ప్లెక్సీలే వాటి వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. తక్షణమే ఫ్లెక్సీలను వేరే చోటికి మార్చుకోవాలని ఎస్సై వెంకట్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది.శ్రీను,మహేష్,ముత్తయ్య,వివిధ గ్రామాల ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333