నూతన రేషన్ కార్డులు అందజేసిన కలెక్టర్,ఆర్ డి ఓ,ఎమ్మెల్యే 

Jul 25, 2025 - 19:45
 0  37
నూతన రేషన్ కార్డులు అందజేసిన కలెక్టర్,ఆర్ డి ఓ,ఎమ్మెల్యే 

అడ్డగూడూరు 25 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోనీ ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన నూతన రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల  సామేల్,జిల్లా కలెక్టర్ హనుమంతురావు,ఆర్డిఓ చేతుల మీదుగా నూతన రేషన్ కార్డ్ లబ్ధిదారులకు అందజేశారు. కలెక్టర్,ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేషన్ కార్డు ఉంటే నిరంతరం ప్రక్రియ అని అన్నారు.లేని వారందరూ అప్లై చేసుకోవాలని అన్నారు.ఇందిరమ్మ ఇల్లు మొదటి దశ లబ్ధిదారులందరూ ఆగస్టు వరకు ముగ్గు పోసుకొని బీస్మెంటు వరకు త్వరగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు.ముగ్గు పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందన్నారు.ప్రవేట్ బడి వద్దు ప్రభుత్వం బడి ముద్దు అని కలెక్టర్ అన్నారు.ప్రభుత్వ బడిలో మేము కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చామని అన్నారు.ప్రైవేటు బడిలో తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పుల పాలు అయ్యే అవకాశం కూడా ఉందన్నారు.ప్రభుత్వ స్కూల్లో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి మంచి భోజనం,స్కూల్ యూనిఫామ్,పుస్తకాలు,కాఫీలు, మంచి విద్యావంతులైన ఉపాధ్యాయులు ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చదివించాలని కలెక్టర్ కోరినారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శేషగిరిరావు,ఎంపీడీవో శంకరయ్య,మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జ్యోజి,పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్,వైస్ చైర్మన్ లు,అడ్డగూడూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్,టీపిసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలేoల సైదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామశాఖల అధ్యక్షులు,వెల్దేవి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య,కార్యకర్తలు రేషన్ కార్డ్ లబ్ధిదారులు,మహిళలు సంఘం నాయకురాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333