పోరాటాల ద్వారానే దోపిడీ, పీడన నుండి విముక్తి.సిపిఎం
జోగులాంబ గద్వాల 23 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- పోరాటాల ద్వారానే దోపిడి పీడ న నుండి విముక్తి సిపిఎం
ప్రజా పోరాటాల ద్వారానే పీడిత ప్రజలకు దోపిడీ పీడనల నుండి విముక్తి జరుగుతుందన్న భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్నప్పటి నుంచి లౌకిక భావాలతో విస్తృతమైన ప్రజా పోరాటాల ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కులం మతం ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ సంఘటితం చేసి పోరాడారని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్ర వక్రీకరణలు విభజన విద్వేష రాజకీయాలతో బ్రిటిష్ వారిని మించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. భగత్ సింగ్ ఆశయాలకు భిన్నంగా పాలన నడిపించడమే కాకుండా మళ్లీ భగత్ సింగ్ వారసులం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దోపిడీ పీడనకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్య విస్తృత ప్రజా ఉద్యమాల ద్వారా స్వాతంత్రోద్యమ కాంక్షను పెంచారని అన్నారు .ప్రజా పోరాటాలు వ్యక్తితో ప్రారంభమై ఒక వ్యక్తితో ముగిసేవి కాదని సమాజంలో దోపిడీ, పీడన ఉన్నంతవరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్న భగత సింగ్ స్ఫూర్తితో ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న శ్రమ దోపిడి పీడనలకు, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద యుద్ధాల దోపిడీ పీడన నుండి మానవజాతి సామాజిక వ్యవస్థను నెలకొల్పడమే అంతిమ లక్ష్యంగా జీవితాంతం పోరాడిన భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజల పక్షాన చివరిదాకా నిలిచి సిపిఎం పోరాడుతుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ కార్మికులు డ్యాం అంజి తిమ్మప్ప తిరుమలేష్ వెంకట్రామయ్య మహేందర్ పురుషోత్తం తదితరులు ఉన్నారు.