నోటి దూల*మాటలు ఉపసంహరించుకోండి కేటీఆర్ టిడిపి నాయకులు వాసిరెడ్డి రామనాథం

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం: నోటి దూల మాటలు ఉపసహరించుకోండి కేసిఆర్ .... కేసీఆర్ అవివేక వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నాయకులు రామనాధం శేఖరబాబు కేసీఆర్ గారూ!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి గెలిచి ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పాలనలో, చంద్రబాబు గారు తన పదేళ్ల పాలనా కాలంలో తెలంగాణా ప్రాంతం లోను ఆంధ్రప్రాంతం లోనూ సంపదను సృష్టించిన విషయం మీకు తెలుసు అందులో టిడిపిలో వివిధ హోదాలలో పనిచేసిన మీకు భాగస్వామ్యం ఉన్నది
అది మరచి టీడీపీని నాయకులను పత్రికలను దృష్టిలో పెట్టుకొని దూషిస్తూ నిన్న ఎర్రవల్లి లోని మీ ఫాం హౌస్l లో మీ కార్యకర్తల సమావేశంలో గుంట నక్కల భాషను వాడి చేసిన వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తున్నది
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి సవ్యంగా పాలిస్తుంది
అదేవిధంగా 2028 లో తెలంగాణా రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పరచటానికి తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు నిన్నటి సమావేశాల్లో కేసీఆర్ శాశ్వతం కాదని మీరే అన్నారుగదా గతంలో మీరు మీ పార్టీయేతర పాలకులను సన్నాసులు దద్దమ్మలు తప్పుగా అన్నని కూడా అన్నారు
తిట్టటం తిట్టించు కోవటంలో ప్రజలు విసిగి పోయారని అది రాజకీయం కాదని అంటు వ్యాధి అని టీడీపీ హితవు పలుకుచున్నది
అంతే గాదు టీఆర్ఎస్ పేరుమార్చి బీఆర్ఎస్ అని పెట్టి దాని శాఖలను ఇతర రాష్ట్రాలలో పెట్టించిన మీరు ఆయా రాష్ట్రాలలో వాటి సంపదలను దోచుకోవటానికా అని అనుకొనే ప్రమాదమున్నది మీరు గమనించాలి
ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్
డాక్టర్ వాసిరెడ్డి రామనాధo
ఈరోజు ఉదయం 11:30 నిమిషాలకు మధిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు, పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు అధ్యక్షతన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ కమిటీ కన్వీనర్ శ్రీ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, రాష్ట్ర నాయకులు చేకూరి శేఖర్ బాబు పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మధిర రూరల్ మండల అధ్యక్షుడు మార్నీడు పుల్లారావు, కార్యదర్శి మాదల నరసింహారావు, రాష్ట్ర నాయకురాలు మేడిపల్లి రాణి, మధిర వార్డ్ కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు పాశం రామనాథం, మేడ వెంకటేశ్వరావు, వనమా వెంకటి, సట్టు వెంకటేశ్వర్లు, మేడేపల్లి కిషోర్, బి రాయప్ప తదితరులు పాల్గొన్నారు.