సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
జోగులాంబ గద్వాల6 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మానవపాడు. మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ బి.మ్. సంతోష్ ఆదేశాలతో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి అర్ఫద్దీన్ సారధ్యంలో తెలంగాణ సాంస్కృతి శాఖ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే పై అవగాహన కల్పించారు.. ప్రతి యొక్క కుటుంబం మరియు ప్రజలు ప్రభుత్వ అధికారులకు కులగనన సర్వేకు సహకరించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ కేశవులు రమాదేవి స్వామి కవిత హజరత్ భూపతి కృష్ణ రాహుల్, గ్రామపంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డి మరియు మహిళలు గ్రామపంచాయతీ సిబ్బంది వృద్ధులు తదితరులు పాల్గొన్నారు..