లక్ష డబ్బులు వేయి గొంతుకలు హాజరైన ప్రజా యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్న
మునగాల 08 జనవరి 2024 తెలంగాణవార్తా ప్రతినిధి :- మునగాల మండల పరిధిలోనిబరకత్ గూడెం గ్రామంలో ఫిబ్రవరి 7 తేదీన హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వేల సంస్కృతిక మహాప్రదర్శన కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని కళానేతల ప్రచార రథయాత్ర.తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగల నాయకత్వంలో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ మహానగరంలో నిర్వహించే లక్ష డప్పులు వేయి గొంతుల సాంస్కృతిక మహాప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలలో నెల రోజులపాటు కళా నేతల ప్రచార రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నిన్న సూర్యపేటలో మొదలైన ప్రచార రథయాత్ర కార్యక్రమం రాత్రి మంగళవారం మునగాల మండల కేంద్రానికి చేరుకొని ఈరోజు మునగాల మండలంబరాకాత్ గూడెం గ్రామానికి చేరుకుంది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బహుజన యుద్ధనౌక లక్షదప్పుల సాంస్కృతిక నిర్వహణ అధ్యక్షులు ఏపూరి సోమన్న హాజరయ్యారు, వారుగ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడుతూ, ఫిబ్రవరి 7వ తేదీన ఎస్సీ వర్గీకరణకై గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో జరగబోయే లక్ష దప్పుల రే గొంతుల సాంస్కృతిక ప్రదర్శనకు ప్రతి గ్రామం నుండి మాదిగవాడల నుండి ఇంటికి ఒక డబ్బు చొప్పున లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ కొరకు 30 ఏళ్లుగా పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్నప్పటికీ తెలంగాణలో వర్గీకరణ అమలు కాకుండా కొంతమంది స్వార్థపరుల కుట్రల వల్ల ఆలస్యం అవుతుందని వర్గీకరణ సామాజిక న్యాయపరమైన సమస్య కాబట్టి ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు మాదిగలంతా ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్కు లక్షలాదిగా తరలిరావాలని తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో భారీగా ఊరేగింపు ర్యాలీ చేసి కళాకారులు ఆటపాటలతో తమ సందేశాన్ని వినిపించారు.
ఈకార్యక్రమంలో, మహాజన సోషలిస్టు పార్టీ, ఎమ్మార్పీఎస్,ఉమ్మడి నల్గొండ జిల్లాఇన్చార్జి కందుకూరు సోమన్న మాదిగ. కళానేతల సంస్కృతిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాటేపాక శంకర్. కళానేతల సూర్యాపేట జిల్లాఅధ్యక్షులు వీరస్వామి. ఎం.ఎస్.పి. జిల్లప్రధానకార్యదర్శి కొత్తపెళ్లి అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ,ఎం.ఎస్.పి. మునగాల మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీనుమాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్యమాదిగ. ఎమ్మార్పీఎస్ బరకత్ గూడ గ్రామ శాఖఅధ్యక్షులు.గుడిపాటి కనకయ్య.రాంపంగు రమేష్, జిల్లేపల్లి సైదులు, మొలుగూరి వెంకటేశ్వర్లు, యామపంగి వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.