సూర్యాపేట జిల్లా నేరస్తుల గుండెల్లో గూబులే ఇక ఈ జాగిరాలతో

జిల్లా పోలీసుకు రెండు నూతన డాగ్స్

Mar 6, 2025 - 18:45
Mar 6, 2025 - 21:23
 0  186
సూర్యాపేట జిల్లా నేరస్తుల గుండెల్లో గూబులే ఇక ఈ జాగిరాలతో

డాగ్ షెల్టర్ రూమ్స్ ప్రారంభించిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ 

సూర్యాపేట, టౌన్ 6 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-  సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు నూతనంగా ట్రాకర్ లూసీ , ఎక్స్-ప్లోజీవ్ బ్రూనో అనే రెండు డాగ్స్ ను కేటాయించిన సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్మించిన డాగ్ షెల్టర్ గదులను (జాగిలం గదులు) ఈరోజు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్  ప్రారంభించారు. ముందుగా ఎస్పి కి ట్రాకర్ డాగ్ లూసీ పూలబుకే తో స్వాగతం తెలిపింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ పోలీస్ శాఖ నందు విధుల నిర్వహణ, కేసుల చేదనలో డాగ్స్ (జాగిలం) కు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది అన్నారు. చాలా కేసుల్లో నేరస్తులను పసిగట్టుటలో డాగ్స్ బాగా పని చేశాయి, హంటర్, ట్రాకర్, నార్కోటిక్, ఎక్స్ ప్లోజీవ్ ఇలా 6 విభాగాల్లో శిక్షణ పొందిన డాగ్స్ మనకు ఉన్నాయి అన్నారు. 

ఇప్పుడు కొత్తగా ట్రాకర్ డాగ్ (పేరు లూసీ) ఇది నేర స్థలంలో లభించే ఆధారాలతో నేరస్తులను గుర్తిస్తుంది, మరో డాగ్ ఎక్స్ ప్లోజివ్ (పేరు బ్రూనో) ఇది పేలుడు సామాగ్రిని గుర్తిస్తుంది అన్నారు. బాగా విధులు నిర్వర్తించాలని డాగ్ స్క్వాడ్ సిబ్బందిని ఆదేశించారు. డాగ్ శిక్షణలో ప్రతిభ చూపిన ప్రశంసా పత్రాలను డాగ్ స్క్వాడ్ సిబ్బందికి అందించారు.

ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, AR DSP నరసింహ చారి, RI లు నారాయణ రాజు, నరసింహ, డాగ్ స్క్వాడ్ RSI రాజశేఖర్, RSI లు సురేష్, k.అశోక్, M. అశోక్, రెహమాన్, మహేష్, AR సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333