స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి
వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్

భువనగిరి 25 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- దివ్వాంగులను కించపరిచేలా తన సోషల్ మీడియా అకౌంటో లో పోస్ట్ పెట్టిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని గుండాల మండల వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలవంతులతో పోటీ పడలేని బలహీనుల కోసమే రిజర్వేషన్లు కల్పించారని, సమాజంలో అనేక విషయాలలో అసమానతలు ఉన్నాయని అందుకు అందరూ సమానంగా జీవించాలని లక్ష్యంతో కొన్ని అదనపు అవకాశాలు కల్పించడం జరిగిందని ఉన్నత విద్యను అభ్యసించిన ఆమెకు వీటిపై అవగాహన లేకపోవడం బాధాకరమని అన్నారు. 2016 దివ్వాంగుల సమానత్వ చట్టపకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఎన్టిడిఆర్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దివ్యాంగులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు.