చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి 

Oct 11, 2024 - 21:38
Oct 11, 2024 - 21:42
 0  9

 తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి

శుభాకాంక్షలు సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించుకోవాలి 

జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,

తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు,

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

(సూర్యాపేట టౌన్ అక్టోబర్ 11) చెడుపై మంచి సాధించిన విజయమే  విజయదశమి వేదికగా ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చరిత్ర ఇతిహాసాలు పురాణాల ఆధారంగా చెడుపై మంచి సాధించినందుకు సంకేతం గానే ప్రజలు విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నారని గుర్తు చేశారు.

 తెలంగాణ రాష్ట్ర ప్రజలు నవరాత్రిఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేయడం గొప్ప విషయం అన్నారు. సమాజం లో దైవ అనుగ్రహంతోనే మానవజాతి మనుగడ ఉంటుందని పంతంగి వీరస్వామి గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా విజయదశమి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జమ్మి చెట్టు కొమ్మ పాలపిట్ట ల సాక్షిగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందోత్సవాలు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి మరియు దీపావళి శుభాకాంక్షలు పంతంగి వీరస్వామి గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ గౌరవ సలదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ రియల్ ఎస్టేట్ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ రియల్ ఎస్టేట్ ఉపాధ్యక్షుడు ఖమ్మం పాటీ అంజయ్య గౌడ్ పట్టేటీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333