గ్రామసభను అసంపూర్ణంగా ముగించిన అధికారులు

Jan 22, 2025 - 19:57
Jan 23, 2025 - 02:26
 0  6
గ్రామసభను అసంపూర్ణంగా ముగించిన అధికారులు

తెలంగాణ వార్త జనవరి 22 వేములపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు వేములపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభను అధికారులు అసంపూర్ణంగా ముగించినారు గ్రామంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు భూమిలేని నిరుపేదలకు 12000 వేలు ఇచ్చే వారి యొక్క లబ్ధిదారుల జాబితా తెలియపరచమని ప్రభుత్వం చెప్పగా గ్రామసభ ఏర్పాటు చేశారు వేములపల్లి ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రామ సభలో ఇండ్లు ల లబ్ధిదారుల జాబితాలు ఇంకా తయారు కాలేదని చెప్పి కేవలం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లనుచదివి  తూతూ మంత్రంగా ప్రజలు వినిపించి వెళ్లిపోగా గ్రామ ప్రజలు ఆందోళన చేసి లబ్ధిదారుల జాబితా బయటపెట్టాలని డిమాండ్ చేశారు నీరు పేదలకు ఇచ్చే స్కీములో చాలామంది అనరులైన ఉన్నారని వారి యొక్కపేరులు రాలేదని అలాగే రేషన్ కార్డు లబ్ధిదారులు జాబితాలు కూడా చాలా అవకతవకాలు జరిగాయని కేవలం 76 మందికి రేషన్ కార్డులు లిస్టులో వచ్చాయని చెప్పి అందులో కూడా అనర్హులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలాకొంతమందిని చేర్చడం సరికాదని ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం గుర్తించి అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేరేలా చూడాలని మళ్లీదరఖాస్తులు చేసుకోవడం ఏంటని తిరిగి తిరిగి  అలసిపోయామంటూ ప్రజలు అధికారులను నాయకులను నిలదీయడం జరిగింది రేపు జరగబోయే ఎలక్షన్ లో ప్రజల యొక్క సానుభూతి కొరకు వారిని ఆశపెట్టి ఓట్లు వేయించుకోవాలని మోసపూరిత మైన ఆలోచనలతో ఈ గ్రామ సభ పెట్టినట్టుగా ప్రజలు ఆరోపిస్తున్నారు..

Vallapudasu Kiran Miryalaguda Reporter Nalgonda Dist Telangana State