BRS పార్టీ తీర్ధం పుచ్చుకున్న NRI-ఆస్ట్రేలియా ధీరావత్ రాయమల్ దంపతులు

Jan 22, 2025 - 20:00
Jan 23, 2025 - 02:29
 0  8
BRS పార్టీ తీర్ధం పుచ్చుకున్న NRI-ఆస్ట్రేలియా ధీరావత్ రాయమల్ దంపతులు
BRS పార్టీ తీర్ధం పుచ్చుకున్న NRI-ఆస్ట్రేలియా ధీరావత్ రాయమల్ దంపతులు

కండువా కప్పిన మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు

తెలంగాణ వార్త జనవరి 22 మిర్యాలగూడ : మరియుమాన్ తండా గ్రామం నుంచి మాలోతు హరి లావూరి వెంకటరామ్ నాయక్  ఈ రోజు మిర్యాలగూడ టౌన్ రెడ్డి కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మాజీ  ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు  నల్లమోతు భాస్కర్ రావు  సమక్షములో దామరచర్ల మండలం రాళ్లవాగుత౦డ గ్రామానికి చెందిన NRIఆస్ట్రేలియా ధీరావత్ రాయమల్ మరియు వారి సతీమణి ధీరావత్ స్రవంతి ఆదేవిధముగా ఇదే గ్రామం కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యనాయకులు ధీరావత్ బాలాజీ నాయక్, ధీరావత్ అశోక్, టిడిపి నుంచి ధీరావత్ అశోక్, ధీరావత్ చందర్ భాను, ధీరావత్ రాజు, సపావత్ రాందాస్ , ధీరావత్ లచ్చు నాయక్ అలాగే దామరచర్ల మండల మాన్ తండా గ్రామానికి చెందిన మాలోతు హరి మరియు లావూరి వెంకట రామ్ నాయక్  బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో కెసిఆర్ నాయకత్వములో తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాలలో అభివృద్ది చెందిందని కానీ ప్రస్తుత పాలనలో రాష్ట్రం అన్నీటిలో వెనుబాటుకు గురి అయిందని ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చడములో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పారు.. రుణమాఫీ పూర్తిగా మాఫీ చేయలేదని  14 నెలలు అయిన రైతు బంధు ఇవ్వలేదని, మహిళలకు నెలకు 2500 ఇవ్వట౦లేదని, పెన్షన్ 2 వేల నుంచి 4 వేలు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ఎండగట్టారు..

అనంతరం పార్టీలోకి చేరిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపి రాబోయేది మన ప్రభుత్వమేనని కావున మనమందరం మరల కేసీఆర్ ని సీయం చేయటానికి కృషి చేయాలని అయా దిశగా పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరచాలని తెలిపారు.

 కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షులు దుర్గంపూడి నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు ఎండి.యూసుఫ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు అంగోతు హాతీరాం నాయక్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ & వైస్ ఛైర్మన్ లు బైరం సంపత్, కుందూరు వీరకోటి రెడ్డి, సోము సైది రెడ్డి, ధీరావత్ పున్నా నాయక్, బాల సత్యనారాయణ, లావూరి శ్రీను నాయక్, అక్కురామ్ నాయక్, ఆపద్బాంధ౦ పథకం నిర్వాహకులు షేక్. రఫీ భాయి, రవీందర్ నాయక్, రమేష్,ఎస్. సైదా నాయక్, నునావత్ శ్రీను, నాగు, గుగులోతు నాగు, మహేష్, చిన్న బాబు, రాము, ఎన్. బాలు, కృష్ణ, శ్రీరాములు, లచ్చు నాయక్, దసృ, కృష్ణా నాయక్, నాగు తదితరులు ఉన్నారు..

Vallapudasu Kiran Miryalaguda Reporter Nalgonda Dist Telangana State