గట్టుసింగారం ప్రభుత్వ పాఠశాలలో జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు

అడ్డగూడూరు 11 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడ్డూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ యువకులు చెరుకు శివ మహారాజ్ మాట్లాడుతూ..మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుక ఏప్రిల్ 11 భారత దేశ సామాజిక విప్లవ ప్రదాత మార్గదర్శి..శుద్రాతి శూద్రుల మేధో జ్యోతి..కలశము లేని నిత్య సంఘర్షణ శైలి భవితరాల బడుగులు ఆశాజ్యోతి భవితమంతా సమానత్వం కోసం పోరాడిన కుతంత్రాలు తెలియని సామాజిక విప్లవ నేత..బాలిక విద్య, వితంతు,వివాహo, హక్కుల కోసం పోరాడిన సామాజిక విప్లవ నేత.. తన భార్య సావిత్రిబాయి పూలతో కలిసి తొలి బాలికల పాఠశాలను స్థాపించి మహిళలకు విద్యారత ఉన్నది అని ధైర్యవంతమైన సందేశాన్నిచ్చిన స్ఫూర్తి ప్రదాత.. సావిత్రిబాయి జన్మదినం జనవరి 3న భారత బాలిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.2015లో తల్లి సేవలకు గాను కూని ఈశ్వర్ద్యాలయాన్ని సావిత్రిబాయి పూలే మహిళా విశ్వవిద్యాలయం అని పేరు కూడా పెట్టారు.స్త్రీల అభ్యున్నతి కోసం ఎల్లలేని కృషి చేశారని అదేవిధంగా సత్యశోధ సంస్థను స్థాపించి అణకారిన వర్గాలకు అండగా ఉండాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు,గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.