పెద్దగట్టు జాతర సరళి పరిశీలించిన మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ

Feb 19, 2025 - 18:05
Feb 19, 2025 - 18:15
 0  3
పెద్దగట్టు జాతర సరళి పరిశీలించిన మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ
పెద్దగట్టు జాతర సరళి పరిశీలించిన మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ
పెద్దగట్టు జాతర సరళి పరిశీలించిన మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ
పెద్దగట్టు జాతర సరళి పరిశీలించిన మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ
పెద్దగట్టు జాతర సరళి పరిశీలించిన మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ
పెద్దగట్టు జాతర సరళి పరిశీలించిన మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ

దురాజుపల్లి...

పెద్దగట్టు జాతర సరళి పరిశీలించిన మల్టీ జోన్ 2 ఐజి శ్రీ సత్యనారాయణ ఐపిఎస్ గారు.

బందోబస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారిని, విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను అభినందించిన ఐజి గారు.

సీసీటీవీ కెమెరాల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి జాతర ను పరిశీలించారు.

దురాజుపల్లి పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర సందర్భంగా ఈరోజు మల్టీ జోన్ 2 ఐజి శ్రీ సత్యనారాయణ ఐపిఎస్ గారు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారితో కలిసి జాతరలో పోలీసు బందోబస్తును, జాతర సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు జాతరలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, పార్కింగ్, వాహనాల మళ్లింపు, కమాండ్ కంట్రోల్స్ సెంటర్, సిబ్బంది భోజనం వసతి, సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, పోలీస్ కంట్రోల్ రూం, హెల్ప్ లైన్ సెంటర్, క్రైమ్ డైటేక్షన్ టీమ్స్, షీ టీమ్స్ ఏర్పాటు, జాతర సరళి వివిధ అంశాలను ఐజి గారికి వివరించారు.

ఐ జి శ్రీ సత్యనారాయణ ఐపిఎస్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరైన దురాజ్పల్లి పెద్దగట్టు జాతరను జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహిస్తుందని అన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ పరంగా జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీని మరియు జిల్లా పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తున్నానన్నారు. ఐదు రోజులపాటు జరుగుతున్న ఈ జాతరలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి దొంగతనాలు చోటు చేసుకోకుండా నివారించారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల జాతీయ రహదారిపై ఎలాంటి ట్రాఫిక్ జామ్ అవలేదని తెలిపారు. వాహనాల మళ్లింపు వల్ల ఎవరు అసౌకర్యానికి గురవలేదని అన్నారు. మహిళా భద్రత లో భాగంగా 50 మంది పోలీసు సిబ్బందితో షీ టీం బృందాలు ఏర్పాటు, అనుమానితులను గుర్తించడానికి ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు మంచి ఫలితానిచ్చినది అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాహనాల మళ్లింపులను, ట్రాఫిక్ పాయింట్ లను, క్యూ లైన్ లను భక్తులు, ప్రజలు, వాహనదారులు సద్వినియోగం చేసుకుని పోలీస్ వారికి సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి జాతర నలుదిశలా పరిశీలించారు. అనంతరం దైవదర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఐజి గారిని ఎస్పీ గారిని సన్మానించి పెద్దగట్టు జాతర జ్ఞాపికను అందించారు.  

ఐజి గారి వెంట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు, AR అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి రవి, సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, స్థానిక SI మహేశ్వర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333