ఫిబ్రవరి 16 న జరిగే పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి.
తిరుమలగిరి 15 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- కేంద్రంలో ఆర్.ఎస్.ఎస్ నేతృత్వంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ ప్రభుత్వం, మతోన్మాద ఫాసిస్ట్ విధానాలను శరవేగంతో అమలు చేస్తుంది.అందులో భాగంగానే ప్రజలపై పన్నుల భారాలు వేసి,కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్నది. ఈ వైఖరిని వ్యతిరేకిస్తూ భారత కార్మిక సంఘాలు,కిసాన్ సంయుక్త మోర్చ (ఎస్.కె.ఎం) లు ఈనెల 16న అఖిల భారత స్థాయిలో పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయిని తిరుమలగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం CPI జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి, CPM జిల్లా కమిటీ సభ్యులు కడెం లింగయ్య, CPI ML న్యూడెమోక్రసి జిల్లా కమిటీ సభ్యులు పోలేబోయిన కిరణ్, MCPIU నియోజకవర్గం కార్యదర్శి నలుగురి రమేష్, BLF మండలం కన్వీనర్ కందుకూరి యాదగిరి లు ఈ బంద్ ను తిరుమలగిరి మండలంలోని అన్ని వర్గాల ప్రజలు,ప్రజాస్వామిక వాదులు,మేదావులు,రైతులు,కార్మికులు, యువ జన,మహిళ, విద్యార్ధులు సహకరించి విజయవంతం చేయాలని అన్నారు.
ఈ సందర్బంగా వారు మాటలాడుతూ అచ్ఛాదిన్ ఆయేగా, విశ్వగురు,ఆత్మ నిర్బర్ భారత్,మేకిన్ ఇండియా పేర్లతో మోసపూరిత నినాదాలిచ్చి దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు, అదాని, అంబానీలకు దారాదత్తం చేసింది.యుద్ద విమానాల మొదలుకొని రైల్వే,పోర్ట్ లు,బి.ఎస్. ఎన్.ఎల్,లాంటి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రభుత్వరంగ సంస్థలన్నీ యదేచ్చగా అమ్మివేసింది. అడవులు,సహజ వనరులను వ్యూహత్మక అమ్మకాల పేరుతో కార్పొరేట్ల పరం చేసింది. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటిస్తానంలో 4 లేబర్ కోడ్ లను తెచ్చి,కార్మికులకు కనీస వేతనం నిర్ణయించే విధానానికి స్వస్తి పలికింది.కార్మిక హక్కులను కాలరాసీ,కంపెనీ యాజమాన్యాలకు మేలుచేసే 12 గంటల పనివిదానాలను అమలు చేస్తుంది.కార్మిక వెల్పర్ బోర్డులను నిర్వీర్యం చేసి కాంట్రాక్ట్ లేబర్ పద్దతులను పెంచి,శ్రమదోపికి గురిచేస్తుంది.కనీస వేతనం , పాత ఫెన్షన్ విధానాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది.
వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు రైతు చట్టాలను విశ్వప్రయ్నాలు చేసి రైతు ప్రతిఘటనతో విరమించుకుంది.ఆ సందర్భంగా మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదు, 2014 శ్వమినాదన్ సిఫారసులను అమలు చేయకుండా,వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పంచకుండా తాత్సారం చేస్తుంది. దేశానికి రైతే రాజు అంటూనే రైతు వెన్నెముక విరిచి వెన్నుపోటు పొడుస్తున్నది. మరోవైపు ప్రాచీన భారత రాజ్యాంగం పేరుతో మనుస్మృతి ని అమలు చేయడానికి భారత రాజ్యాంగాన్ని నీరుగారుస్తు అందులో ప్రజలకు ఉపయోగపడే చట్టాలను రద్దు చేస్తున్నది.ఆస్థానంలో ప్రజా వ్యతరేక చట్టాలను అమలు చేస్తుంది.అందులో భాగంగానే నూతన కార్మిక చట్టాలు,నూతన జాతీయ విద్యావిధానం 2020, అడవి సంరక్షణ నియమాలు, NIA లాంటి వాటిని తీసుకువచ్చింది.
ఈ పరిస్థితుల్లో బీజేపీ మోడీ ప్రభుత్వం మతోన్మాద, ఫాసిస్ట్ విధానాలను,కార్మిక,కర్షక, నిరుద్యోగ యువత,విద్యార్థి,ఉద్యోగ,ప్రజావ్యతిరేక,మతతత్వ దోరనులను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె,గ్రామీణ భారత్ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజయ వంతం చేయాలిని అన్నారు. ఈ సమావేశంలో తోపుడు బండ్ల సంఘం మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, CPI మండలం కార్యదర్శి తీపురాల శ్రీకాంత్, PDSU జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల సుధాకర్, కనుకు అశోక్, బోండ్ల వెంకన్న, కోక యశ్వంత్, లింగస్వామి, చెరుకు వేణు తదితరులు పాల్గొన్నారు.