ఇసుక డంపింగ్ పరిశీలించిన ఆర్ ఐ ప్రసన్న

Mar 23, 2024 - 21:46
 0  12
ఇసుక డంపింగ్ పరిశీలించిన ఆర్ ఐ ప్రసన్న

తిరుమలగిరి 24 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామ శివారులో సర్వేనెంబర్ 113,114 గల మామిడి తోటలో అక్రమంగా తాటిపాముల బిక్కిరివాగు నుండి ఇసుకను ట్రాక్టర్ల తరలించి డంపు చేసిన సుమారు 100 ట్రిప్పుల ఇసుక డంపును రెవెన్యూ ఆర్ఐ ప్రసన్న శనివారం పరిశీలించారు. ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తాటిపాముల బిక్కిరి వాగు నుండి డంపు చేసి రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం. ఆర్ఐ ప్రసన్న వెంట శ్రుజిత్ రెడ్డి ఉన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034