భారీ వర్షాలకు భారీగా పంట నష్టం

Sep 4, 2024 - 19:40
Sep 4, 2024 - 22:21
 0  269
భారీ వర్షాలకు భారీగా పంట నష్టం

తిరుమలగిరి  04 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం తొండ వెలిశాల గుండె పూరి బండ్లపల్లి జలాల్పురం మామిడాల సిద్ధి సముద్రం వివిధ గిరిజన తండాలు మరియు మున్సిపాలిటీ అనంతరం నందపురం తాటిపాముల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీగానే పంట నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయ అధికారి సిహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో  తెలిపారు. సుమారు వరి పంట 70ఎకరాలు,పత్తి 200 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.పరిహారం కోసం రైతుల నుండి అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు తెలిపారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034