రాజీ మార్గమే.. రాజ మార్గం..కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తాడు రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు
తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్
తుంగతుర్తి డిసెంబర్ 11తెలంగాణ వార్త ప్రతినిధి:- ఈ నెల 14 వరకు జరిగే జాతీయ లోకదా లత్ సందర్బంగా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన (కాంపౌడబుల్ కేసులు) కేసులలో క్షణికావేశంలో, విచక్షణ కోల్పోయి, ఆవివేకంతో పట్టింపులకి పోయి కేసులు నమోదు చేసుకుని పంథాలకి పోకుండా రాజీ పడే కేసులలో కక్షిదారులు రాజీ పడి అన్నదమ్ముల్లా మెలగాలని, రాజీ మార్గమే రాజమార్గం అని, ప్రతి ఒక్క కక్షీ దారుడు జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,ఈ పెట్టి కేసులో, డ్రంకెన్ డ్రైవ్ లలో పట్టుబడిన వారు ఈ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకుని వారిపై నమోదైన కేసులని క్లియర్ చేసుకోనగలరు.